ఇంగ్లీషులో బాగా మాట్లాడాలంటే ఎలా?

మనదేశ భాష కాదు అని ఎంత అనుకున్నా, ఇంగ్లీష్ మనదేశంలో హిందీతో పాటు ఒక అఫిషియల్ లాంగ్వేజ్.అంతేకాదుగా, ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఇంగ్లీష్ ని చూడాల్సిందే.వేరే దేశాలు తిరగడం పక్కనపెడితే, మంచి ఉద్యోగం సంపాదించాలన్నా, లక్షల్లో జీతం పొందాలన్నా ఇంగ్లీష్ కావాల్సిందే.

ఇంగ్లీషు మనలో చాలామందికి పూర్తిగా రాదు అని కాదు, వచ్చు కాని మాట్లాడమే కష్టం.ఈ కష్టాన్ని దాటి ఇంగ్లీషులో గలగలా మాట్లాడాలంటే ఈ పద్ధతులు పాటించండి.

* మొదట ఇంగ్లీషు చదవడం వినడం అలవాటు చేసుకోవాలి.ఇంగ్లీషు న్యూస్ పేపర్ చదవడం, కథలు చదవం ద్వారా పదాల కూడిక, వాక్యాల కూడిక ఎలా ఉండాలి అనే విషయం అర్థం అవుతుంది.

Advertisement

అలాగే బాగా వినాలి.క్రికేట్ కామెంట్రి కావచ్చు, ఎవరిదైనా ఇంటర్వ్యూ కావచ్చు, ఒక సందర్భాన్ని వాళ్ళు ఎలా వివరిస్తున్నారో అర్థం చేసుకోండి.

* ఇంగ్లీష్ ఓసారి మాట్లాడితే వచ్చేది కాదు.రోజూ మాట్లాడుతూ ఉండాలి.

ఇంగ్లీషు మాట్లాడగలిగే ఒక ఫ్రెండ్ ఉంటే ఎంతో లాభం.తనతో మాట్లాడుతూ, తప్పులేమైనా ఉంటే తెలుసుకోవచ్చు.

* ఇంగ్లీషు సినిమాలు చూడటం అలవాటు చేసుకోండి.దీని ద్వారా ఉచ్చారణ తెలుసుకోవచ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

సబ్ టైటిల్స్ ఉన్న సినిమా చూడటం బెటర్.ఎందుకంటే వారి స్లాంగ్ అంత త్వరగా అర్థం కాదు.

Advertisement

* ఇంగ్లీషులో ప్రతీరోజు కొత్త పదాలు పుట్టుకొస్తుంటాయి.అందుకే రోజుకి కనీసం రెండు పదాల అర్థాలు, వాడకం తెలుసుకోండి.

* ఇంగ్లీషులో ఉన్న కంటెంట్ ని గట్టిగా చదవాలి.దీని ద్వరా పదాలు మన నోటికి అలవాటు అవుతాయి.

ఉచ్చారణలో దోషాలు ఉంటే బయటపడతాయి.* ఇక చివరగా, ముఖ్యంగా, మీ నేస్తాలతో ఇంగ్లీషులో చర్చించండి.

ఇక్కడ ఆత్మవిశ్వాసం పొందితే, రేపు పది మందిలో మాట్లాడటం అంత కష్టంగా అనిపించదు.

తాజా వార్తలు