బీజేపీ బలమైన అభ్యర్థిని నిలబెడుతుందా?

తెలంగాణలో అందరి దృష్టి వచ్చే నెలలో జరగబోయే వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక మీదనే ఉంది.

ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామా కారణంగా ఈ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలుసు.

వామ పక్షాల అభ్యర్థి రంగంలో ఉన్నా ప్రధాన పోటీ టీఆరెస్, కాంగ్రెస్, ఎన్డీయే అభ్యర్థుల మధ్యనే ఉంటుంది.ఇక్కడ ఎన్డీయే తరపున బీజేపీ అభ్యర్థి రంగంలోకి దిగుతున్నాడు.

టీడీపీ ఇక్కడ పోటీ చేయనని చెప్పింది.బలమైన అభ్యర్థి కోసం బీజేపీ గాలిస్తోంది.

బలమైన అంటే గులాబీ పార్టీ అభ్యర్థిని మట్టి కరిపించే వాడు కావాలి.అలాంటి వ్యక్తీ దొరుకుతాడా? బీజేపీ, కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థులను బట్టి తన అభ్యర్థిని ఎంపిక చేయాలని గులాబీ పార్టీ వేచి ఉంది.అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ కూడా మల్లగుల్లాలు పడుతోంది.

Advertisement

ఎవరికీ వారు అవతలి పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం ఎదురు చూస్తున్నారు.బీజేపీ విషయంలో బలమైన అభ్యర్థి దొరకడంతో పాటు టీడీపీ కూడా పూర్తిగా సహకరించాలి.

ఎపీకి ప్రత్యేక హోదా ఇవ్వని అంశం ఇక్కడ ప్రభావం చూపుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.కానీ అది ఆంధ్రా సమస్య కాబట్టి ఇక్కడ ప్రభావం ఉండదని కొందరు అంటున్నారు.

తెలంగాణాలో బీజేపీ -టీడీపీ మధ్య అంతగా సఖ్యత లేదనే వాదన కూడా ఉంది.గెలుపు మీద గులాబీ పార్టీ పూర్తీ నమ్మకంతో ఉంది.

తాము గెలుపు సాధిస్తామని కాంగ్రెస్ కూడా చెప్పుకుంటోంది.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు