ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు స్విచ్ఛాఫ్‌.... ఎమ్మెల్యేలకు జ‌గ‌న్ హుకుం

రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను, వారి కుటుంబాలను విహార యాత్రల పేరుతో త‌ర‌లించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి వారి క‌ద‌లిక‌పైనా నిఘా ఉంచిన‌ట్లు స‌మాచారం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో తొలిసారిగా రాజ్యసభ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలను తెర‌లేపిన జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్టితిలోనూ అధికార పార్టీ నేత‌ల‌కు అందుబాటులో లేకుండా త‌న ఎమ్మెల్యేలను వ్యూహాత్మ‌కంగా క‌ట్ట‌డి చేస్తున్న‌ట్టు విన‌వ‌స్తోంది.

ప‌ది రోజుల పాటు సొంత వారికి, వ్యాపారాల‌కు దూరంగా ఉండాల‌ని, సెల్ ఫోన్‌ల‌న్నీ క్యాంప్‌కు సార‌ధ్యం వ‌హించే వారు సూచించిన వ్య‌క్తుల‌కు అప్ప‌గించాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది.అవ‌స‌ర‌మైతే మిన‌హా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు ఫోన్ల‌న్నీ స్విచ్ఛాఫ్ చేసి ఉంచాల‌ని హుకుం జారీ చేసిన‌ట్లు విన‌వ‌స్తోంది.

ఇప్పటికే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి త‌దిత‌రులు విదేశాల‌లో ఉండ‌టంతో కొన్నాళ్ళు అక్క‌డే ఉండాల‌ని, జూన్‌ 11న రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగే నాటికి హైద‌రాబాద్ వ‌చ్చేలా చూసుకోవాల‌ని వారికి సూచ‌న‌లు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.వైసీపీకి చెందిన 67 మంది శాస‌న స‌భ్యుల‌లో 17 మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరిన విష‌యం విదిత‌మే.

మిగిలిన వారిలో 40 మంది మాత్ర‌మే విహార యాత్రలకు వెళ్ల‌టం గ‌మ‌నార్హం.క్యాంపు శిబిరాల ఖ‌ర్చు మొత్తం పోటీలోని అభ్య‌ర్ధి భ‌రిస్తున్న‌ప్పుడు మీకేంట‌ట‌.

Advertisement

అని మ‌రికొంద‌రు త‌మ కోరిక‌ల చిట్టాల‌ను విప్పి తీర్చ‌క‌పోతే గోడ దూకేస్తామ‌ని స‌న్నిహితుల ద్వారా చెప్పిస్తున్న‌ట్టు స‌మాచారం.నాలుగో అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ ఎటాంటి స్పష్టత ఇవ్వక పోవ‌టం కూడా జగన్‌లో మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు కార‌ణ‌మై ఉంటుంద‌ని, అభద్రతా భావం ఉన్నందునే జ‌గ‌న్ క్యాంపు రాజకీయాలను న‌డుపుతున్నార‌న్న‌ సంకేతాలూ ప్ర‌జ‌ల‌లో బ‌లంగా చేరుకున్నాయ‌ని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏది ఏమైనా వైకాపా క్యాంపు రాజకీయాలు మ‌రి రానున్న రోజుల‌లో ఎంత ర‌స‌కందాయంలో ప‌డ‌నున్నాయో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు