‘లీడర్‌’ సీక్వెల్‌ ఎవరు చేస్తారు?

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లీడర్‌’ సినిమాతో రానా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే.

మొదటి సినిమాతోనే ప్రయోగం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన రానా ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేయడంతో పాటు, తమిళం మరియు హిందీలో సైతం తన సత్తా చాటాడు.

తాజాగా ఈయన ‘బాహుబలి’ సినిమాలో విలన్‌గా సైతం నటించి సూపర్‌ అనిపించుకున్నాడు.ఈ నేపథ్యంలో రానాకు ‘లీడర్‌’ సీక్వెల్‌పై మనస్సు పడ్డట్లుగా అనిపిస్తోంది.

తాజాగా రానా ‘లీడర్‌’ సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది అంటూ ప్రకటించాడు.రానా ప్రకటనతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘లీడర్‌’ సీక్వెల్‌ గురించిన చర్చ జరుగుతోంది.

ఈ సీక్వెల్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే చర్చ ఎక్కువగా ఫిల్మ్‌ ప్రముఖుల మద్య జరుగుతోంది.మొదటి పార్ట్‌కు దర్శకత్వం వహించిన శేఖర్‌ కమ్ములకు హీరో రానా ఆ అవకాశం ఇస్తాడా లేక మరే దర్శకుడి చేతిలో అయినా ఈ సీక్వెల్‌ను పెడతాడా అనేది చూడాలి.

Advertisement

లీడర్‌ సీక్వెల్‌కు కథ రెడీ అవుతోంది.రానా రాజకీయ నేపథ్యంలో మరోసారి సినిమా చేయనుండటంతో అందరి దృష్టి ఇప్పటి నుండే ఆ సినిమాపై ఉంది.

ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు