ప‌వ‌న్ కోసం మూడు నియోజ‌క‌వ‌ర్గాలు రెడీ

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ తాను ఎమ్మెల్యేగా అనంత‌పురం జిల్లా నుంచే పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో రాజకీయంగా ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇదే విష‌యంపై గ‌తంలో అనంత‌పురం స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేసిన ప‌వ‌న్ ఇటీవ‌ల జ‌న‌సేన మూడేళ్ల ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో సైతం మ‌రోసారి తాను అనంత‌పురం జిల్లా నుంచే పోటీ చేస్తాన‌ని నొక్కివ‌క్కాణించాడు.

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ఓ వైపు అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీ ప‌వ‌న్ క‌ద‌లిక‌ల‌పై జిల్లాలో బాగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో జిల్లాలో పవన్ పోటీచేసే స్థానం అనంతపురమేనని ఇప్పటిదాకా చర్చల్లో ముందు ఉంది.

అక్క‌డ ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గ ఓట‌ర్లు చాలా బ‌లంగా ఉన్నారు.వీరితో పాటు మిగిలిన సామాజిక‌వ‌ర్గాల మ‌ద్ద‌తు కూడా ఉండ‌డంతో ప‌వ‌న్ అనంత‌పురంను ఎంచుకుంటాడ‌న్న టాక్ స్టార్టింగ్‌లో వినిపించింది.

ఆ త‌ర్వాత అదే జిల్లా గుంత‌క‌ల్లు పేరు కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది.గుంత‌క‌ల్లులో ప‌వ‌న్‌కు బ‌ల‌మైన అభిమాన సంఘాలు ఉన్నాయి.

Advertisement

ఈ రెండు నియోక‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ ఎమ్మెల్యేగా ఎక్క‌డ పోటీ చేస్తాడ‌ని చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే ఇప్పుడు అదే జిల్లాలోని క‌దిరి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.అనంతపురం నుంచి కాకుండా కదిరినుంచి పోటీ చేస్తే జనసేన పార్టీని రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో బలోపేతం చేసుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

కదిరి అటు చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో ఉంది.ఒక‌వేళ ప‌వ‌న్ ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి వెళ్లాలంటే క‌ర్నూలు జిల్లా నుంచే వెళ్లాల్సి ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే క‌దిరి నుంచి పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ అనంత‌పురంతో పాటు క‌డ‌ప‌, చిత్తూరుపై గ‌ట్టిగా ఉంటుంద‌ని ప‌వ‌న్ లెక్క‌లు వేస్తున్నాడ‌ట‌.ఇక కోస్తాలో చాలా జిల్లాల్లో ప‌వ‌న్‌కు సొంత సామాజిక‌వ‌ర్గం అండ ఎలాగూ ఉంటుంది.

అందుకే ప‌వ‌న్ దృష్టి రాయ‌ల‌సీమ‌పై ప‌డిన‌ట్టు తెలుస్తోంది.మ‌రి ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ ఆప్ష‌న్ ఏది అవుతుందో చూడాలి.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు