పోయింది ప‌రువే క‌దా!! స‌ర్దుకుపోతాడులే..

పార్టీ పోయింది ఫీల్ అయ్యాడా ప‌దవి పోయింది ఫీల్ అయ్యాడా అస‌లు ఇజ్జ‌త్తే పోయింది ఏమైనా అనుకున్నాడా లేదు క‌దా! ములాయం జీ అలాంటి మ‌నిషి కాడండి కాడు క‌నుక‌నే ఇన్నేళ్లు రాజ‌కీయంలో ఉండ‌గ‌లిగాడు.

స‌న్ స్ట్రోక్ త‌గిలినా మ‌రొక‌టో ఇంకొక‌టో ఇబ్బంది వ‌చ్చి ఇర‌కాటంలో పెట్టినా.

చూడండి మావోడెంత ఘ‌నుడో విద్యుత్ శాఖ‌కు ఏకంగా నాలుగైదు ల‌క్ష‌ల బిల్లు ఎగొట్టాడు అదీ దేశ సేవ అంటే.అట్టా ఉండాలి.

వాడుతున్న‌దేమో 40 కిలోవాట్ల విద్యుత్ అయితే నెల నెలా క‌డుతుంది మాత్రం ఐదు కిలోవాట్ల విద్యుత్ కి మాత్ర‌మే !అదీ మ‌నిషంటే అలా ఉండాలి.ఏ హిపోక్రసీ లేకుండా.

నాయ‌కుడంటే ఇలానే ఉండాలి మ‌హాత్ముడు కాక‌పోవ‌చ్చు ములాయంలా ఉంటే ఎవ‌రి హ‌యాంలో అయినా జిమిక్కులు చేసేయ్యొచ్చు.స‌ర్‌! ఇప్ప‌టికైనా బిల్లు చెల్లిచేయండి.

Advertisement

బాగోదు.చాలా బాగోదు.

అయినా మీది అధికార ప‌క్షం కూడా కాదాయె ఎందుకొచ్చిన క‌క్కుర్తి !! కాదంటారా.ఇక మీ ఇష్టం బాసు!!!.

Advertisement

తాజా వార్తలు