పవన్ కళ్యాణ్ ని దారుణంగా అవమానించిన రాజమౌళి తండ్రి

రచయిత విజయేంద్రప్రసాద్ .ఈయన పేరుకి పరిచయం అక్కరలేదు కాని, పుత్రోత్సాహంతో పొంగిపోయే ఈ స్టార్ రైటర్ ని ఇంకా అందరు రాజమౌళి నాన్న అనే పిలుస్తారు.

జక్కన్న విజయాల వెనుక అతిపెద్ద బలం ఆయన.స్టూడెంట్ నం.1 నుంచి బాహుబలి దాకా, ఒక్క మర్యాద రామన్న తప్పిస్తే రాజమౌళికి అన్ని కథలు ఆయనే రాసారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు.కథల మీద, కథారచన మీద అంతటి పట్టు ఉన్న విజయేంద్రప్రసాద్, మరో కథారచయితని దారుణంగా అవమానించారు.

ఆ కథారచయిత ఎవరనుకున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.పవన్ పెన్ను పట్టిన సినిమాలేవి ఆడలేదు.

ఒకప్పుడు జానీ, గుడుంబా శంకర్, కొత్తగా సర్దార్ గబ్బర్ సింగ్ .అన్నీ దారుణమైన పరాజయాల్నే చూసాయి.ముఖ్యంగా సర్దార్ కథని రెండేళ్ళు కూర్చోచి రాసానని పవన్ చెప్పటంతో, అందరు తీవ్ర విమర్శలు చేసారు.

Advertisement

సర్దార్ లాంటి నాసిరకం కథతో పంపిణీదారుల జీవితాలతో ఆడుకున్నారని, బయ్యర్లు రోడ్డుమీదకి కూడా ఎక్కిన సంగతి తెలిసిందే.ఇక బాహుబలి ప్రమోషన్స్ లో భాగంగా విజయేంద్రప్రసాద్ బాహుబలి అభిమానులు అడిగిన ప్రశ్నలకి ఓ వీడియో ద్వారా జవాబులు ఇచ్చారు.

అందులో పవన్ టాపిక్ వచ్చినప్పుడు విజయేంద్రప్రసాద్ "పవన్ కళ్యాణ్ సిన్సియారిటీ అంటే చాలా ఇష్టం.ఆయన కథలు ఆయన రాసుకోకపోతే ఇంకా ఇష్టం" అంటూ పవన్ కళ్యాణ్ పెన్ను పవర్ మీద చాలా పెద్ద కామెంట్ విసిరారు.

ఇప్పుడు ఈ కామెంట్స్ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తున్నారు.అలాగే మహేష్ బాబు - రాజమౌళి సినిమా గురించి మాట్లాడిన విజయేంద్రప్రసాద్ .మహేష్ - రాజమౌళి కలిసి సినిమా చేస్తారని, కాని ఆ ప్రాజెక్టు మొదలవడానికి ఇంకొంచెం సమయం పడుతుందని తెలిపారు.

ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు