దోమ కాటుకి సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు

దోమలు మానవ మరియు జంతు రక్తాన్ని పీల్చి మనుగడ సాగిస్తాయి.దోమలకు రక్తాన్ని పిల్చుకోవటానికి సన్నని పదునైన మరియు పొడవైన నోటి బాగం ఉంటుంది.

దోమ కుట్టినప్పుడు కన్నా ఆ తర్వాత భాద మరియు నొప్పి ఎక్కువగా ఉంటాయి.దోమ కాటు వలన వాపు, చర్మం దద్దుర్లు, చర్మం ఇన్ఫెక్షన్, కమిలిన గాయాలు మరియు దురద వంటి లక్షణాలు ఉంటాయి.

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో దోమ కాటు కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి.అందువలన ఇప్పుడు దోమ కాటు లక్షణాలకు ఉపశమనం కలిగించే కొన్ని ఇంటి నివారణల గురించి తెలుసుకుందాం.1.నిమ్మకాయ నిమ్మకాయలో సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనస్థిటిక్ లక్షణాలు ఉండుట వలన దోమ కాటు చికిత్సలో బాగా సహాయపడుతుంది.

నిమ్మకాయను రెండు బాగాలుగా చేసి ఒక నిమ్మ చెక్కతో ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి.దోమ కాటు వలన ఇన్ ఫెక్షన్ రాకుండా నిమ్మరసం సహాయపడుతుంది.మరొక ఎంపికగా తులసి రసంలో నిమ్మరసం కలిపి ప్రభావిత ప్రాంతంలో రాయవచ్చు.2.ఉల్లిపాయ లేదా వెల్లుల్లి ఉల్లిపాయ మరియు వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసనలు దోమ కాటు వలన వచ్చే వాపు మరియు దురద ఉపశమనంలో సహాయపడతాయి.ప్రభావిత ప్రాంతంలో ఉల్లిపాయ ముక్కతో రుద్దితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.3.బేకింగ్ సోడా బేకింగ్ సోడా దోమ కాటు దురదకు సమర్ధవంతంగా పనిచేస్తుంది.

Advertisement

దీనిలో సహజమైన ఆల్కలీన్ ఉండుట వలన చర్మం యొక్క pH స్థాయిలను తటస్థీకరణ చేసి ఉపశమనం కలిగిస్తుంది.ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి.ఈ నీటిలో ఒక కాటన్ వస్త్రాన్ని ముంచి పిండి ప్రభావిత ప్రాంతంలో వేసి 15 నిముషాలు అలా ఉంచాలి.4.కలబంద కలబంద సహజమైన ఏంటి సెప్టిక్ ఏజెంట్ గా పనిచేయుట వలన దోమ కాటు వలన వచ్చే నొప్పి, వాపు మరియు దురదలను తొందరగా తగ్గిస్తుంది.

కలబంద జెల్ ని తీసుకోని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి.జెల్ చల్లగా అయ్యిన తర్వాత ప్రభావిత ప్రాంతంలో రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు