గుడ్డుని ఎన్ని నిమిషాలు ఉడకబెడితే మంచిది?

గుడ్డు ఉడకబెట్టడం సులువైన పనే కావచ్చు.కాని గుడ్డుని సరిగా ఉడకబెట్టడం సులువైన పనేం కాదు.

మీరే తిని చూడండి, ఒక్కోసారి ఎగ్ వైట్ మెత్తగా ఉంటుంది, ఒక్కొసారి లోపల యోల్క్ మెత్తగా ఉంటుంది.దాన్నే ఉడికిన గుడ్డు అనుకోని తినేస్తుంటారు.

కాని ఉడికిఉడకని గుడ్డు అది.కాబట్టి గుడ్డును సరిగ్గా, చక్కగా ఎలా ఉడకబెట్టాలో చూడండి.గుడ్డు సరిగా ఉడకడం అంటే బయట ఎగ్ వైట్, లోపల యోల్క్, రెండూ గట్టిగా ఉండాలి.

ఇప్పుడు ఎన్ని నిముషాల ఉడకబెట్టడం వలన గుడ్డు ఎలా మారుతుందో చూద్దాం.* 1-3 నిమిషాలు ఉడకబెడితే అసలేం ఉడికినట్టే ఉండదు.అంతా పచ్చిగానే ఉంటుంది.

Advertisement

* 5-7 నిమిషాలకి కొద్దిగా ఉడుకుతుంది గుడ్డు.బయట ఎగ్ వైట్ కొంచెం గట్టిగా మారినా, లోపల యోల్క్ మాత్రం ఇంకా పచ్చిగానే ఉంటుంది.

* 9-11 నిమిషాల్లో దాదాపుగా పని అయిపోయొనట్టే.ఎగ్ వైట్ గట్టిగా మారుతుంది కాని లోపల యోల్క్ ఇంకా కాస్త పచ్చిగానే ఉంటుంది.

* 12-15 నిమిషాలు ఉడికిన తరువాత లోపల, బయట, సరైన బాయిల్డ్ ఎగ్ మీ ముందు ఉంటుంది.వైట్, యోల్క్ రెండూ గట్టిగా ఉంటాయి.

కాబట్టి, మోడరేట్ హీట్ మీద ఓ గుడ్డుని కనీసం 12 నిమిషాలు ఉడకబెడితే మంచిది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు