ఇంటర్నెట్ లేకున్నా వీడియోలు చూసే వసతి యూట్యూబ్ లో

మన ఆధునిక జీవితాలు యూట్యూబ్ మీద ఎంతలా ఆధారపడి ఉన్నాయో తెలిసిన విషయమే.

సినిమా ట్రైలర్లు, పాటలే కాదు, వంట చిట్కాలు, చివరికి మిస్ అయిన క్రికేట్ మ్యాచులు, సీరియల్స్, కాలక్షేపం కోసం కామెడి వీడియోలు, అన్నిటికి యూట్యూబ్ మీదే ఆధారపడి ఉన్నాం.

కాని యూట్యూబ్ లో వీడియోలు చూడాలంటే wifi ఉండాల్సిందే.మొబైల్ డేటాతో యూట్యూబ్ ఎంజాయ్ చేయడం కష్టమైన విషయం.

మరీ ముఖ్యంగా 2G డేటాతో అస్సలు కుదరని పని.అందుకే "Youtube Go" ని మార్కేట్లోకి దింపేసింది యూట్యూబ్.ఇది కూడా యూట్యూబే.కాని కొత్తరకం.2G స్పీడ్ తో కూడా దీన్ని నడపొచ్చు అని యూట్యూబ్ టీమ్ చెబుతోంది.అంతేకాదు, మనకిష్టమైన వీడియోలు డవున్లోడ్ చేసుకోని ఇంటర్నెట్ లేనప్పుడు కూడా చూసుకోవచ్చు.

ఇలాంటి ఆఫ్ లైన్ మోడ్ ఇప్పటికే ఉందిగా అని అంటున్నారా? Youtube Go లో వీడియోలు మీ మెమోరి కార్డుకి కూడా డన్లోడ్ చేసుకోవచ్చు.మన డేటా చాలా అంటే చాలా తక్కువ ఖర్చు అవుతుందట ఈ యాప్ లో.ప్రస్తుతం unreleased అని ప్లే స్టోర్ లో చూపిస్తున్నా, ఇవాళో, రేపో ఈ యాప్ పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తుంది.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు