దీపావళి మూడు రోజుల్లో దీపారాధన చేస్తే..?

దీపావళి ఎందుకు వస్తుందో అందరికీ తెలిసిందే.కానీ దీపావళి రోజుల్లో దీపారాధన మనం చేస్తుంటాం ఎందుకు చేస్తాం.

దానివలన ఎలాంటి సత్ఫలితాలు వస్తాయి.ఏంటి అనే విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు.

అసలు దీపావళి ముందు రోజు నరకచతుర్ధసి.అంతకుముందు ధనత్రయోదశిని ఆచరిస్తారు.

అమావాస్యకు తర్వాతి రోజున బలిపాడ్యమిగా కొన్నిచోట్ల జరుపుకుంటారు.కార్తీశుద్ధ పాడ్యమినే బలిపాడ్యమిగా జరుపుకుంటారు.

Advertisement

బలి చక్రవర్తిని మించిన దానశూరులుండరు అంటారు.బలి చక్రవర్తి ఇచ్చిన మాటకోసం తన ప్రాణాలనే ఇచ్చేశాడు.

వజ్ర, వైఢూర్యాలు, మునిమాణిక్యాలు వంటివి దానమివ్వడంతో పాటు తనకు తానుగానే దానం ఇచ్చుకున్న గొప్ప వ్యక్తి బలిచక్రవర్తి.బలి ని చాలా మంది చ కొన్ని ప్రాంతాల్లో పూజించడం ఆనవాయితీ.

కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి, వారు తమ జాతీయ పర్వమైన ఓనంను బలి పండుగగా చేసుకుంటారు.దక్షిణభారతదేశంలో దీపావళి మూడునాళ్ళ పండుగగా జరుపుకుంటే, ఉత్తరభారతదేశంలో, మొత్తం ఐదు రోజులపాటు దీపావళిని జరుపుకుంటారు.

ధనత్రయోదశి నాటి సాయంత్రం ఇంటి వెలుపల యముని కోసం దీపం వెలిగిస్తే అపమృత్యువు నశిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.అలాగే, ధనత్రయోదశి, అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోషసమయాన దీపదానాన్ని చేస్తే, యమమార్గాధికారం నుంచి విముక్తుడు అవుతాడని విశ్వాసం దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని "కౌముదీమహోత్సవం" అని నిర్వచించినట్లుగాను.ఇలా దీపావళి రోజున దీపారాధన చేయడం వలన మృత్యుభయం పోతుంది.

Advertisement

సకల సౌభాగ్యాలు కలుగుతాయి.

తాజా వార్తలు