మన్మోహన్‌ను వదలని 'బొగ్గు' మసి

మాజీ ప్రధాని, మౌన మునిగా పేరుపడిన మన్మోహన్‌ సింగ్‌ను బొగ్గు మసి వదలడంలేదు.అది ఇప్పట్లో వదలదు కూడా.

మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో బద్దలైన బొగ్గు కుంభకోణంలో ఆయన పాత్ర ఏమిటనేది ఇంకా నిర్థారణ కాలేదు.మన్మోహన్‌ అసమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకున్నా అవినీతి ప్రధాని అనే పేరు రాలేదు.

కాని బొగ్గు కుంభకోణంలో ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.ఎందుకంటే బొగ్గు శాఖను ఆయనే నిర్వహించారు కాబట్టి.

అప్పట్లో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు కూడా ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్నారు.ఈ కుంభకోణంలోని పదిహేను మంది నిందితులు కూడా తమకే పాపం తెలియదని, బొగ్గు శాఖను నిర్వహించిన ప్రధాని సూచనల మేరకే తాను పనులు చేశామని చెబుతున్నారు.

Advertisement

అందరూ పాపాత్ముడు మన్మోహన్‌ అనే చెబుతున్నారు.ప్రధాని ఏం చెబితే అదే చేశా అని దాసరి కూడా సిబీఐ ఇంటరాగేషన్లో చెప్పారు.

జార్ఖండ్‌లోని అమరకొండ ముర్గదంగల్‌ బొగ్గు క్షేత్రాన్ని పారిశ్రామికవేత్త జిందాల్‌కు అక్రమంగా ఇవ్వడమే ఈ బొగ్గు కుంభకోణం.ఇదే కాక మరికొన్ని బొగ్గు గనుల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.

బొగ్గు క్షేత్రాలను కట్టబెట్టడంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని సీబీఐ దర్యాప్తులో తేలింది.ఇందులో ఎవరి పాత్ర ఏమిటనేది తేలాల్సిఉంది.

ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టును మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సమన్లు పంపండి అని ఈ కేసులో నిందితుడైన జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా కోరారు.బొగ్గు శాఖను నిర్వహించింది ఆయనే కాబట్టి ఆయనను కూడా కోర్టుకు పిలిపించాలని కోరారు.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ .. ఏర్పాట్లు ఇలా  

కోడా అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.వచ్చే నెల రెండో తేదీన ఈ కేసు విచారణకు రానుంది.

Advertisement

మాజీ ప్రధాని ఏం చెబుతారో విన్న తరువాత ఈ కేసు ఏ ములపు తీసుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు