మెగా ఎక్స్ ప్రెస్ అంటున్న మేర్లపాక గాంధి..!

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజాలతో తీసిన రెండు సినిమాలను హిట్ అందుకున్న మేర్లపాక గాంధి మూడో ప్రయత్నంగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు ఓ కథ వినిపించాడని తెలిసిన వార్తే.

చరణ్ కూడా మేర్లపాక గాంధితో సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.

ఓ లవ్ స్టోరీతో ఈ సినిమా రానుందట.యువి క్రియేషన్స్ వారు సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

అయితే ఈ సినిమా టైటిల్ గా మెగా ఎక్స్ ప్రెస్ అని పెట్టబోతున్నారట దర్శకుడు మేర్లపాక గాంధి.మొదటి రెండు సినిమాల్లో కూడా ఎక్స్ ప్రెస్ ను ఉంచిన డైరక్టర్ అదే సెంటిమెంట్ తో ఇప్పుడు చరణ్ సినిమా కోసం కూడా మెగా ఎక్స్ ప్రెస్ అని టైటిల్ పెడుతున్నారట.

ప్రస్తుతం ధ్రువ సినిమాతో బిజీగా ఉన్న చరణ్ ఆ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్లో మూవీకి సిద్ధమయ్యాడు.రెండు సినిమాలతో హిట్ కొట్టిన డైరక్టర్ తో సినిమా తీసేందుకు సిద్ధమైన చరణ్ ను చూసి ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నా మెగా ఎక్స్ ప్రెస్ అనే టైటిల్ తో వారిని కన్విన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

Advertisement

మరి ఈ మెగా ఎక్స్ ప్రెస్ మోత ఎలా మొగనుందో చూడాలి.

ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
Advertisement

తాజా వార్తలు