బాబు కేబినెట్‌లో క్యాస్ట్ ఈక్వేష‌న్ మిస్ ఫైర్‌

దాదాపు యేడాదిన్న‌ర కాలంగా ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎట్ట‌కేల‌కు ఈ రోజుతో పూర్త‌య్యింది.చంద్ర‌బాబు పాత మంత్రివ‌ర్గంలో ఉన్న‌వారిలో ఐదుగురిని తొల‌గించి.

కొత్త‌గా 11 మందికి చోటు క‌ల్పించారు.దీంతో బాబుతో పాటు కొత్త మంత్రివ‌ర్గంలో 26 మంది మంత్రులు ఉన్నారు.

ఇక త్వ‌ర‌లోనే విస్త‌రించేందుకు ఖాళీలు కూడా లేకుండా బాబు మంత్రివ‌ర్గాన్ని కంప్లీట్ చేయ‌డంతో ఇదే 2019లో బాబు ఎన్నిక‌ల కేబినెట్‌గా కూడా భావిస్తున్నారు.ఇదిలా ఉంటే బాబు కేబినెట్‌లో కులాల అస‌మ‌తుల్య‌త స్ప‌ష్టంగా క‌నిపించింది.

కొన్ని సామాజిక‌వ‌ర్గాల‌కే పెద్ద పీఠ వేయ‌గా మ‌రి కొన్ని కీల‌క కులాల‌కు అస్స‌లు ప్రాధాన్య‌మే ల‌భించ‌లేదు.మైనార్టీలు, ఎస్టీల నుంచి ఒక్క మంత్రికి కూడా చోటులేదు.

Advertisement

దీంతో ఈ రెండు వ‌ర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది.క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చంద్ర‌బాబుతో క‌లుపుకుంటే అత్య‌ధికంగా 6 బెర్తులు ద‌క్కాయి.ఇక అగ్ర వర్ణాల్లో 4 కాపుల‌కు, 4 రెడ్ల‌కు ఇచ్చారు.1 వైశ్య‌, 1 వెల‌మ‌, 8 మంది బీసీల‌కు, 2 ఎస్సీల‌కు ఇచ్చారు.26 మంత్రి ప‌ద‌వుల్లో ఎస్సీల‌కు 4 వ‌ర‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చే ఛాన్స్ ఉన్నా.బాబు మాత్రం 1 మాల‌, 1 మాదిగ‌తో స‌రిపెట్టేశారు.

ఇక బీసీల‌కు 8 బెర్తులు ఇచ్చి న్యాయం చేసినా ఏపీలో భారీ సంఖ్య‌లో ఉన్న యాదవ సామాజిక‌వ‌ర్గం వారికి బెర్తు ద‌క్క‌క‌పోవ‌డం షాకింగ్ న్యూసే.యాద‌వ సామాజిక‌వ‌ర్గం వారంతా టీడీపీకి ఆదినుంచి ప‌ట్టుగొమ్మ‌లుగా ఉంటున్నారు.

ఇక సీమ‌లో రెడ్ల‌కు బాగా ప్రాధాన్యం క‌ల్పించారు.దీంతో వారికి కూడా నాలుగు బెర్త్‌లు ద‌క్కాయి.

ఏదేమైనా మైనార్టీ వ‌ర్గాల‌కు, ఎస్టీల‌కు అస్స‌లు ప్రాధాన్య‌మే లేక‌పోవ‌డం, బీసీల్లో యాద‌వుల‌కు ఒక్క బెర్త్ కూడా లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఇక కులాల వారీగా మంత్రి ప‌ద‌వులు చూస్తే ఇలా ఉన్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

ఓసీ - క‌మ్మ : నారా చంద్ర‌బాబు నాయుడు (ముఖ్య‌మంత్రి) - నారా లోకేశ్ - ప్ర‌త్తిపాటి పుల్లారావు - దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు -ప‌రిటాల సునీత -కామినేని శ్రీనివాస్‌ ఓసీ - కాపు : గంటా శ్రీనివాస‌రావు - పి.నారాయ‌ణ -నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప - పైడికొండ‌ల మాణిక్యాల‌రావు ఓసీ - రెడ్డి : అమ‌ర్‌నాథ్‌రెడ్డి - భూమా అఖిల‌ప్రియ - సీహెచ్‌.ఆదినారాయ‌ణ‌రెడ్డి -సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఓసీ - వైశ్య : శిద్ధా రాఘ‌వ‌రావు ఓసీ - వెల‌మ : సుజ‌య్ కృష్ణ రంగారావు బీసీ : య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు (యాద‌వ‌) - చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు (కొప్పు వెల‌మ‌) - కింజార‌పు అచ్చెన్నాయుడు (కొప్పు వెల‌మ‌) -పితాని స‌త్య‌నారాయ‌ణ (శెట్టి బ‌లిజ‌) - కాలువ శ్రీనివాసులు (బోయ‌) - కొల్లు ర‌వీంద్ర (మ‌త్స్య‌కార‌) - కేఈ.కృష్ణ‌మూర్తి (ఈడిగ‌) - కిమిడి క‌ళా వెంక‌ట్రావు (తూర్పు కాపు) ఎస్సీ : కేఎస్‌.జ‌వ‌హ‌ర్ (మాదిగ‌) - న‌క్కా ఆనంద్‌బాబు (మాల‌).

Advertisement

తాజా వార్తలు