తొలిరోజే వంద కోట్లు రాజమౌళి ఖాతాలో

బాహుబలి తిరిగోస్తున్నాడు .కేవలం మాహిష్మతి సామ్రాజ్యాన్ని మాత్రమే కాదు, యావత్తు భారత దేశ సినీ సామ్రాజ్యానికి రాజు కాబోతున్నాడు.

మరి నెలరోజులలో మనం కనివిని ఎరుగని బాక్సాఫీస్ రికార్డులు కనబడబోతున్నాయి.కేవలం దక్షిణాది సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, బాలివుడ్ కూడా ఆ రికార్డుల మోతకి ఆశ్చర్యపోవాల్సిందే.

ఆమీర్ ఖాన్ ఇండస్ట్రీ హిట్లు, రజినీకాంత్ ఓపెనింగ్ రికార్డులు .అన్ని తుడిపెస్తాడు జక్కన్న.ఎందుకు అంత నమ్మకం అని మీరు అడగవచ్చు .బాహుబలి ఎన్ని థియేటర్లలో విడుదల కాబోతోందో తెలిస్తే మీరు మా తానకి తందానా అంటారు.బాహుబలి 2, ప్రపంచవ్యాప్తంగా, తెలుగు, హిందీ, తమిల్, మళయాళ భాషలు కలుపుకోని ఏకంగా 6,500 థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఇంతవరకు ఏ భారతీయ చిత్రం ఇన్నేసి థియేటర్లలో విడుదల కాలేదు.ఖాన్ త్రయం కన్నా ఓ 1500 థియేటర్లు ఎక్కువే దొరకనున్నాయి రాజమౌళికి.దీంతో మొదటిరోజు కలెక్షన్ల అంచనాలు పెరిగిపోతున్నాయి.

Advertisement

తొలిరోజే వంద కోట్ల గ్రాస్ వసూళ్ళని బాహుబలి సాధించడం దాదాపుగా ఖాయం అని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.ఈ అంచనా లేక్కతప్పదు.

ఎందుకంటే కబాలి తొలిరోజు 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.ఈ లెక్కన జక్కన్న మరో 20 ఎక్కువ కలెక్ట్ చేయడం మంచినీళ్ళు తాగినంత ఈజీ పని.మొత్తానికి తొలిరోజే వంద కోట్ల గ్రాస్ సాధించబోతున్న తోలి భారతీయ చిత్రం కాబోతోంది బాహుబలి 2.ఇక లైఫ్ టైమ్ గ్రాస్ వసూళ్లు వెయ్యి కోట్లకు పైగా ఉండొచ్చు అని ఇప్పటికే ప్రేడిక్షన్ పెడుతున్నారు బాక్సాఫీస్ పండితులు.ఇదండీ .ఓ తెలుగు దర్శకుడి కలకి, కళకి దక్కబోతున్న ఫలితం .ఇదండి మన తెలుగు సినిమా స్టామినా !.

Advertisement

తాజా వార్తలు