సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన యువకున్ని సన్మానించిన జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కేంద్ర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుబేర స్వామి వరలక్ష్మీ దంపతుల కుమారుడు సాయి రామ్ కృష్ణ సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన శుభ సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు వారి ఇంటికి వెళ్ళి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎంటెక్ వరకు చదువు పూర్తి చేసుకుని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి తల్లి దండ్రుల కోరిక మేరకు దానికి రాజీనామా చేసి పట్టుదలతో ఇంటి వద్ద నే ప్రభుత్వ ఉద్యోగం కోసం సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివి సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన.

సాయి రాం కృష్ణ ను అతని తల్లి దండ్రులైన కుబేర స్వామి, వరలక్ష్మీ లను జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు అభినందించారు.

సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక కాదు రాబోవు రోజుల్లో ఎస్ ఐ గా డిఎస్పీ పై స్థాయి ర్యాంకు లు సంపాదించాలని ఆయన కోరారు.సివిల్ కానిస్టేబుల్ ఎంపికలో జిల్లా లో 14 వ ర్యాంకు సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్యోగం పొందిన సాయి రామకృష్ణ ను ఆదర్శంగా తీసుకుని యువత చెడు మార్గాన్ని విడిచి పెట్టి పట్టుదలతో వివిధ శాఖల్లో ఉద్యోగం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన సాయి రామకృష్ణ ను అతని తల్లి దండ్రులు వరలక్ష్మీ, కుబేర స్వామిలను , బిఆర్ఎస్ పార్టీ సినియర్ నాయకులు అందె సుభాష్ , బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , ఎఎంసి డైరెక్టర్ మెండె శ్రీనివాస్ యాదవ్, ఎఎంసి మాజీ డైరెక్టర్ ఎలగందుల నరసింహులు లు శాలువాలు కప్పి అభినందించారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News