మనదేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఉద్యోగాలు లేకుండా ఏదైనా చిన్న వ్యాపారమైన చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు.ఎందుకంటే నేటి సమాజంలో ఉద్యోగానికి ఖచ్చితమైన గ్యారెంటీ లేదు.
మరి కొంతమంది ఎంత పెద్ద కంపెనీలో పనిచేసిన ఒకరి క్రింద పని చేస్తున్నాము అనే భావన కలిగి ఉన్నారు.
తాజాగా ఓ వ్యక్తి పెద్ద కంపెనీకి సీఈఒ స్థాయిలో ఉండి కూడా సాదాసీదా మామూలు ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగుల పరిస్థితులను అర్థం చేసుకోవాలనుకున్నాడు.
ఈ విషయం ఆ కంపెనీలో పనిచేసేవారికి కూడా తెలియదు.ఒక పెద్ద కంపెనీ సీఈఓ అంటే హుందాగా ఆఫీస్ కి వచ్చి పై స్థాయి ఉద్యోగులతో మీటింగ్ చేస్తూ ఉంటారు.
ఆ మీటింగ్ లో బిజినెస్ అభివృద్ధి చేయడానికి ప్లాన్స్ అమలు చేసి, కంపెనీ విస్తరణ చేస్తూ ఉంటారు.కానీ, ఇందుకు వ్యతిరేకంగా జొమాటో సీఈవో, ఆ కంపెనీ స్థాపించిన దీపిందర్ గోయల్ మరోలా కొత్తగా ఆలోచించాడు.
తన కంపెనీలో సాధారణ డెలివరీ బాయ్లా రెడ్ టీ షర్ట్ ధరించి, బైక్ మీద ఫుడ్ డెలివరీలు చేశాడు.ఎప్పుడో ఒకసారి కాదు,ప్రతి మూడు నెలలకోసారి, గత సంవత్సరాలుగా ఈయన ఇదే పని చేస్తున్నాడు.
ఈ విషయాన్ని నౌకరీ.కామ్ యాజమాని సంజీవ బిక్చందానీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.
ఈ కంపెనీ సీఈఓ మాత్రమే కాదు కంపెనీలో పనిచేసే సీనియర్ మేనేజర్ లందరూ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి రోజంతా ఫుడ్ డెలివరీలు చేస్తుంటారని చెప్పారు.
గడిచిన మూడేళ్లుగా దీపిందర్ ఇదే పనిచేస్తున్నారని తెలిపారు.అయినా ఇప్పటివరకు తనను ఎవరూ గుర్తు పట్టలేదని దీపిందర్ తనతో చెప్పినట్లు సంజీవ్ తెలిపాడు.సంజీవ్ ట్వీట్ చూసిన నెటిజన్లు జొమాటో సీఈఓపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తమ కు ఫుడ్ ను కూడా ఆయన డెలివరీ చేస్తే చూడాలని ఆసక్తిగా కామెంట్లు చేస్తున్నారు.