సింగిల్ డేలో జస్ట్ టిప్పుగా రూ.97 లక్షలు ఇచ్చిన జొమాటో కస్టమర్లు.. రికార్డు బద్దలు..!

కొన్ని క్లిక్స్‌తో ప్రజల ఇళ్లకు వేడి వేడి ఆహారాన్ని అందించే ప్రముఖ సంస్థ జొమాటో( Zomato ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

ఇది 2024 కొత్త సంవత్సర పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో ఫుడ్ డెలివరీలను అందించింది.

ముఖ్యంగా డిసెంబర్ 31 చాలా బిజీ, సక్సెస్‌ఫుల్ డే అయింది.జొమాటో CEO, దీపిందర్ గోయల్( Zomato CEO Deepinder Goyal ) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో ఆ రోజు గురించి కొన్ని ఫ్యాక్ట్స్ పంచుకున్నారు.31 రోజు జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తులు ఫుడ్ డెలివరీ బాయ్స్ పట్ల చాలా జాలి చూపించారని అన్నారు.ఆ ఒక్కరోజే తమకు ఆహారం తెచ్చిన డెలివరీ పార్ట్‌నర్స్‌కు వారు ఏకంగా రూ.97 లక్షల కంటే ఎక్కువ టిప్స్ రూపంలో అందించారని పేర్కొన్నారు.

Deepinder Goyal Shared About Deliveries On New Year Eve Generous Tips,zomato Del

జొమాటోకి గతంలో కంటే ఆ రోజున ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి.వాస్తవానికి, ఆ ఆర్డర్‌ల సంఖ్య 2015 నుంచి 2020 వరకు మొత్తం ఆర్డర్‌ల సంఖ్య( Zomato Food Orders )కు దాదాపు సమానంగా ఉంది.ప్రజలు అత్యధిక ఈవెంట్లను బుక్ చేసుకున్న నగరం, రెస్టారెంట్లలో అత్యధిక టేబుల్స్‌ను రిజర్వ్ చేసిన నగరం బెంగళూరుగా నిలిచింది.

ఇతర దేశాల నుంచి ప్రజలు అత్యధికంగా ఆహారాన్ని ఆర్డర్ చేసిన రాష్ట్రం మహారాష్ట్ర.కోల్‌కతాకు చెందిన ఒకరు ఒకే ఆర్డర్‌లో 125 ఐటమ్స్ సెలెక్ట్ చేశారు.భారతదేశం నలుమూలల నుంచి ప్రజలు బిర్యానీ( Biryani )ని ఎక్కువగా ఆర్డర్ పెట్టారు.

Advertisement
Deepinder Goyal Shared About Deliveries On New Year Eve Generous Tips,Zomato Del

ఇది ఆ రోజు మోస్ట్ పాపులర్ ఫుడ్ ఐటమ్ అయ్యింది.

Deepinder Goyal Shared About Deliveries On New Year Eve Generous Tips,zomato Del

జొమాటోకి చెందిన క్విక్ డెలివరీ సర్వీస్ బ్లింకిట్‌( Blinkit ) కూడా డిసెంబర్ 31వ రోజున ఎక్కువ ఆర్డర్స్ అందుకుంది.ఇది డ్రింక్స్, స్నాక్స్ వంటి వాటిని అందిస్తుంది.బ్లింకిట్‌ సీఈఓ, అల్బిందర్ ధిండ్సా, వస్తువులు డెలివరీ చేసిన రైడర్లకు ప్రజలు అత్యధిక మొత్తంలో టిప్స్ అందించారని ఎక్స్‌లో పంచుకున్నారు.ఆ రోజున జొమాటో , బ్లింకిట్‌ కోసం 3.2 లక్షల కంటే ఎక్కువ మంది డెలివరీ పార్ట్‌నర్స్‌ పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు