షర్మిలకు ఆ వర్తమానం అందిందా ? నాలుగురోజులు వెయిటింగ్ తప్పదా ? 

ఎన్నో ఆశలతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party )ని స్థాపించిన షర్మిల ఆ పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లడంలోనూ , పార్టీలో చేరుకలను ప్రోత్సహించడంలోనూ విఫలం అయ్యారనే చెప్పవచ్చు.ఇక తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించినా,  రాజకీయంగా ఆ పార్టీకి మైలేజ్ దొరకలేదు.

 Ysrtp Sharmila Waiting For Congress Alliance Decision,ys Sharmila, Ysr Telangana-TeluguStop.com

బీ ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్న షర్మిల పార్టీలో పెద్దగా పేరున్న  నేతలు లేకపోవడం , సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం , పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేకపోవడం , రాబోయే రోజుల్లో పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో ఎదురయ్యే ఇబ్బందులు,  ఇలా అన్నిటిని లెక్క వేసుకున్న షర్మిల కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని భావించినా, కాంగ్రెస్( Congress ) మాత్రం పొత్తు ప్రతిపాదన లేదని, పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సిందిగా సూచించింది.

Telugu Aicc, Congress, Revanth Reddy, Telangana, Ys Sharmila, Ysr Telangana-Poli

దీంతో మరో దారి లేక షర్మిల( YS Sharmila ) విలీనానికి అంగీకారం తెలిపారు.అయితే ఈ విలీన ప్రక్రియ రోజు రోజుకు ఆలస్యం అవుతుండడం, సెప్టెంబర్ 30 వరకు దీనికి డెడ్ లైన్ షర్మిల విధించారు .అప్పటికి విలీన ప్రక్రియ ముందుకు వెళ్లకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగానే పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు.ఆ గడువు కూడా పూర్తి కావడంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు నిర్ణయించుకోగా కాంగ్రెస్ నుంచి ఆమెకు వర్తమానం అందింది.తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని , ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ సలహాదారు ఒకరు ఆమెకు సూచించినట్లు సమాచారం .

Telugu Aicc, Congress, Revanth Reddy, Telangana, Ys Sharmila, Ysr Telangana-Poli

మరో నాలుగు రోజుల్లో ఢిల్లీలో అగ్రనేతల సమావేశం( Delhi Senior Leaders Meeting ) ఉందని , అప్పుడు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని , అప్పటి వరకు తొందరపడవద్దు అని షర్మిలకు సూచించారట .దీంతో మరో నాలుగు రోజులపాటు వేచి చూడాలని షర్మిల నిర్ణయించుకున్నారట.నిన్న జరిగిన పార్టీ నాయకులు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube