ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల: కంచికచర్ల విద్యుత్ శాఖ కార్యాలయ సిబ్బంది కంచికచర్ల గ్రామంలో విద్యుత్ బిల్లులు కట్టని వారి ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లు కట్టమని సిబ్బంది అడగగా కంచికచర్ల వైఎస్ఆర్సిపి నాయకుడు కంచికచర్ల పంచాయతీ 20 వవార్డు మెంబర్ బర్రె శంకర్ విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడికి ప్రయత్నించగా ఈ విషయంపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ విధానంపై విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు మరియు పోలీస్ శాఖ స్పందించి విధి నిర్వహణలో ఉన్నటువంటి వ్యక్తులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని కాదని తమ విధులు నిర్వహించేటప్పుడు ఇలాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు సమస్యను పోలీసు వారి దృష్టికి తీసుకురావడం తో వెంటనే ఎఫ్ఐఆర్ 379/2022 సెక్షన్ 353 506r/w 34 ఐపిసి క్రింద కేసు నమోదు చేయడం జరిగిందని సంబంధిత పోలీస్ శాఖ సిబ్బంది తెలిపారు.
కార్యక్రమంలో కంచికచర్ల మండల విద్యుత్ శాఖ సిబ్బంది మొత్తం పాల్గొన్నారు.







