వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీని( YSRCP USA Social Media Committee ) నియమించింది.పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ఆదేశాల మేరకు ఈ కమిటీ నియామకం అయింది.
వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ( YSRCP USA ) సోషల్ మీడియా కమిటీలో కన్వీనర్ గా గంగిరెడ్డిగారి రోహిత్( Gangireddygari Rohit ) నియామకం కాగా కో-కన్వీనర్లుగా పల్లేటి ఆదిత్య,( Palleti Aditya ) చిల్లా కిరణ్ కుమార్,( Chilla Kiran Kumar ) బంక తేజ యాదవ్ మరియు మైలం సురేశ్ నియామకం అయ్యారు.అలాగే అడ్వైజరీ టీమ్ లో సభ్యులతో పాటు సోషల్ మీడియా ప్రొపర్టీస్ మేనేజ్ మెంట్, నెట్ వర్క్ మేనేజ్ మెంట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ మెంట్ మరియు ఇన్ఫ్లూయెన్సర్ మేనేజ్ మెంట్ విభాగాల్లో కోఆర్డినేటర్, సభ్యులను వైసీపీ నియమించింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు( AP Assembly Elections ) సమయం దగ్గర పడుతున్న తరుణంలో మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా వైఎస్ఆర్ సీపీ తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే 2024 ఎన్నికల యుద్ధానికి పార్టీ సోషల్ మీడియా సైతం సమాయత్తం అవుతోంది.
రాష్ట్రంలోనే కాకుండా వైఎస్ఆర్ సీపీ దేశ, విదేశాల్లో సైతం మంచి పేరును గడించిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఈ నేపథ్యంలోనే తాజాగా 36 మంది సభ్యులతో యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

గతంలోనూ రాష్ట్రంలో వైసీపీ( YCP ) అధికారంలోకి రావడానికి పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా పాత్ర కూడా అధికంగా ఉందన్న సంగతి తెలిసిందే.కమిటీని నియమించిన పార్టీ అధిష్టానం సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయపరంగా పార్టీ సంపూర్ణ మద్ధతు ఉంటుందని తెలిపారు.అయితే ఏపీలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పాలన కొనసాగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రజల పక్షపాతిగా నిలిచిన వైసీపీ ప్రభుత్వం అవినీతిపరుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.మంచి చేసే జగనన్నను ఎదుర్కొనేందుకు రాబందు మూకలన్నీ కలిసి కట్టుగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.ఈ క్రమంలో దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు అండగా నిలిచేందుకు అందరూ సిద్ధం అవుతున్నారు.
ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో( Social Media ) మరింత యాక్టివ్ గా పని చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారు.ప్రతి ఒక్కరూ కలిసి జగనన్నకు మరోసారి పట్టం కట్టేందుకు తమ వంతు పాత్ర పోషించనున్నారు.