ఏపీలో వైకాపా - బీజేపీ పొత్తు వార్తల్లో నిజం ఎంత?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి( YS Jagan Mohan Reddy ) మళ్లీ ఢిల్లీకి వెళ్లాడు.జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది.

 Ysrcp President Ys Jagan Want Bjp Friendship ,ys Jagan Mohan Reddy , Ysrcp , M-TeluguStop.com

అదేంటి అంటే జగన్ ఢిల్లీ బీజేపీ పెద్దల వద్ద పొత్తు విషయమై చర్చలు జరిపాడు.వచ్చే ఎన్నికల్లో ఏపీ లో బీజేపీ( BJP ) తో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాం అంటూ చెబుతూ ఉంటాడు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా ఏపీ లో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యం లో జగన్‌ వచ్చే ఎన్నికల విషయం లో టెన్షన్ గా ఉన్నాడు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

Telugu Amith Shah, Ap, Bjp Ysrcp, Chandra Babu, Delhi, Jp Nadda, Modi, Ysjagan,

బీజేపీ ఇంకా జనసేన పార్టీ లు ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి.ఆ రెండు పార్టీ ల మధ్య ఉన్న పొత్తు విషయం లో కొన్ని అనుమానాలు ఉన్నాయి.జనసేన గతంలో మాదిరిగా టీడీపీ( TDP )ని కలుపుకు పోదాం అంటున్నారు.

కానీ బీజేపీ మాత్రం టీడీపీ ని దూరం ఉంచాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ చిన్న గ్యాప్ ను ఫిల్‌ చేసేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ గ్యాప్ వల్లే తమ తో పొత్తు కు బీజేపీ వస్తుందేమో అంటూ వైకాపా అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఏపీ లో కొత్త పొత్తులకు సిద్ధం అవుతున్నారు అంటూ పుకార్లు వస్తున్నాయి.

Telugu Amith Shah, Ap, Bjp Ysrcp, Chandra Babu, Delhi, Jp Nadda, Modi, Ysjagan,

అయిదు పది స్థానా ల్లో పోటీ చేసి గెలిస్తే ఎన్నికల తర్వాత అయినా పొత్తు కు సిద్ధం అంటూ ఇటీవల ఢిల్లీ బీజేపీ పెద్దల వద్ద జగన్ ప్రతిపాదన పెట్టి వచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో ముందస్తు ఎన్నికల విషయంలో ప్రధాని మరియు రాష్ట్ర హోం శాఖ మంత్రి తో చర్చలు జరిపారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది.తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం ఎప్పటిలాగే తన కేసుల విషయం లో కలిసి ఉంటాడు అంటున్నారు.అసలు విషయం ఆ జగన్ కే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube