వైసీపీ పార్టీ( YCP ) వీడుతున్నట్లు తనపై వస్తున్న వార్తలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి( MP Adala Prabhakar Reddy ) ఖండించారు.తెలుగుదేశం పార్టీ కావాలని ఆడుతున్న మైండ్ గేమ్ అని అన్నారు.
పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు.ఇదే సమయంలో నెల్లూరులో సాగుతున్న లోకేష్ పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాదయాత్ర అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడం… ప్రజా ప్రతినిధుల పై విమర్శలు చేయడం కాదని అన్నారు.రాజకీయాలలో లోకేష్ పిల్లోడు.
ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్థి కూడా లేరు అని ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అభ్యర్థులు లేక వైసీపీ పార్టీలో ఉండే వారిని పార్టీలోకి తీసుకురావడానికి టీడీపీ ( TDP ) ఆడుతున్న మైండ్ గేమ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలలో మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇచ్చే ప్రసక్తి లేరని.లోకేష్( Nara Lokesh ) చెప్పాడంటూ సోమిరెడ్డి తన దగ్గర బాధపడినట్లు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
నెల్లూరు జిల్లాలో ఐదు సార్లు ఓడిపోయి సోమిరెడ్డి రికార్డు సృష్టించాడని ఎద్దేవా చేశారు.జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కాకపోవడానికి కారణం సోమిరెడ్డేనని.ఆ పార్టీలో ఆయన తప్ప ఎవరు ఉండకూడదని మనస్తత్వం.సోమిరెడ్డిది అంటూ విమర్శించారు.
ఎట్టి పరిస్థితులలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక సీటు కూడా వచ్చే ప్రసక్తి లేదని అన్నారు.