అధికార వైయస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.నియోజకవర్గానికి 4,000 మంది చొప్పున గృహసారధులను నియమించనుంది.
ఇక మీరు ఎంపిక ప్రక్రియ ఈనెల 20వ తేదీన పూర్తి అవుతుంది.ఒక్కో మండలానికి సుమారు 60 నుండి కప్పినర్లు, 800 మంది గృహ సారధులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతే ఒక్కో నియోజకవర్గానికి సుమారు నాలుగు వేల మందికి తగ్గకుండా గృహ సారథుల్ని వైసీపీ అధిష్టానం సిద్ధం చేస్తోంది.మండలస్థాయిలో నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే వీరికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి కన్వీనర్లు, గృహసారథులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.6 లక్షల మంది ప్రజలకు, వైసీపీ పార్టీకి మెరుగైన సేవలు అందిస్తున్నారు.అయితే ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలం చేసేందుకు గృహసారథులని తెచ్చారు.ప్రతి యాభై ఇళ్లకు ఒక గృహసారథిని నియమించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 1.2 లక్షల ఇన్ఛార్జిల నియామకం పూర్తి చేయవలసిందిగా పార్టీ వర్గాలని ఆదేశాలిచ్చారు.అలాగే వీరిలో ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టమైన అదేశాలు ఇచ్చారు.గ్రామ, వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వాళ్ళను గృహరులుగా నియమించకూడదని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

పార్టీలో చురుకైన వారికి గృహ అప్పగించడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఆశించిన ఫలితం సాధించవచ్చని అధిష్టానం భావిస్తోంది.ఈమేరక ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే గృహ సారథుల ఎంపికలో ఒకింత జాప్యం చోటు చేసుకుందని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు.ఒక్కో నియోజకవర్గానికి సుమారు నాలుగు వేల మంది గృహ సారథుల్ని నియమించడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నుల్ని తెలుసుకోవడంతో పాటు ప్రజల సచివాలయాల పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ప్రజల నాడిని పసిగట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం గృహ సారథుల బాధ్యత.
ఇక పూర్తిగా ప్రభుత్వంకు రామన్న రోజుల్లో వైసీపీ గృహ సారథులు కీలకంగా మారనున్నారు.







