దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మాట్లాడు

ఏపీ అధికార పార్టీ వైకాపాను ఇరుకున పెడుతూ ఏకంగా అధినేత వైఎస్‌ జగన్‌ పైనే విమర్శలు చేస్తూ ఉన్న ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తీరు మరింత ముదిరింది.ఇటీవల ఆయన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాడు.

 Ysrcp Mp Nandigam Suresh Open Challenge To Raghu Rama Krishnam Raju, Nandigam Su-TeluguStop.com

అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించి ఆయన సంచలనం సృష్టించాడు.వైకాపా జెండాపై గెలిచిన రఘురామ కృష్ణం రాజు ఇప్పుడు ఆ పార్టీ అధినేతను జైలుకు పంపించాలంటూ డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు.

ఇప్పటికి వైకాపా ఎంపీగానే చెలామణి అవుతున్న రఘురామ కృష్ణం రాజుపై ఆ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.తాజాగా వైకాపా ఎంపీ నందిగం సురేష్‌ స్పందిస్తూ ఢిల్లీలో కూర్చుని మాట్లాడటం కాదు.

దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలంటూ సవాల్‌ విసిరాడు.ఎంపీగా వైకాపా బలంతో గెలిచిన ఆయన వైకాపా కు దూరంగా ఉన్నాడు కనుక ఆ పదవికి రాజీనామా చేసి సొంత బలంతో గెలవాలని.

అప్పుడు మాట్లాడితే ఆయన మాటలకు విలువ ఉంటుంది ఆయన్ను జనాలు నమ్ముతారంటూ నందిగం సురేష్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.తోటి ఎంపీ వ్యాఖ్యలపై రఘు రామ కృష్ణం రాజు స్పందన ఏంటో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube