వై ఎస్ సొంత గ్రామం లో సూపర్ ఫాస్ట్ అభివృద్ధి

అదో చిన్న గ్రామం.రెండు మజరా గ్రామాలతో ఉన్న ఆ పంచాయతీ ఓటర్ల సంఖ్య కేవలం 2,253 మాత్రమే.అయితేనేం… ఆ గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.ఆది నుంచి అంతేనా అంటే… కానే కాదు.

 Ysr Own Village Under Development-TeluguStop.com

ఇప్పుడు మాత్రమే అక్కడ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.మొన్నటిదాకా అడిగినా పట్టించుకోని రాజకీయ పార్టీలు… ఇప్పుడు అడగకుండానే అన్నీ చేసేస్తున్నాయి.

అవసరం ఉన్న పనులనే కాక అవసరం లేని పనులను కూడా చేస్తూ ఆ గ్రామస్థుల మనసులను చూరగొనేందుకు నానా పాట్లు పడుతున్నాయి.అయినా ఆ గ్రామం ఏది? ఎక్కడుందనేగా మీ ప్రశ్న.వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే ఆ గ్రామం ఉంది.దాని పేరు బలపనూరు.వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని సింహాద్రిపురం మండలంలో ఈ గ్రామం ఉంది.దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సొంతూరుగా రికార్డులకెక్కిన ఆ గ్రామం… జగన్ కూ ప్రాధాన్యతా గ్రామమే.

ఎందుకంటే ఆ గ్రామం తన పుట్టిల్లు కూడా మరి.

అయినా ఇప్పుడు ఆ గ్రామంలో ఈ హడావిడి అంతా ఎందుకనేగా ప్రశ్న? ఎందుకేమీటి?… త్వరలో ఆ గ్రామ పంచాయతీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఆది నుంచి వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన వ్యక్తే ఆ గ్రామానికి సర్పంచ్ గా గెలుస్తూ వచ్చారు.ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ… ఇప్పటిదాకా అసలు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలోకే దిగలేదు.

అయితే రాజకీయ చదరంగంలో ఆరితేరిన వైఎస్ గతించారు.

2013లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జగన్ కుటుంబం మద్దతు పలికిన సరస్వతమ్మ విజయం సాధించారు.

అయితే ఆమె ఇటీవలే చనిపోయారు.ఈ క్రమంలో వైఎస్ సొంతూళ్లో పసుపు రంగు జెండా ఎగురవేయాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు జగన్ కు కాస్తంత ఇబ్బందికరంగా పరిణమించాయి.ఈ నేపథ్యంలో వైఎస్ సొంతూళ్లో పాగా వేసేందుకు ఇదే సరైన సమయమని టీడీపీ భావిస్తోంది.

ఇక తన సొంతూళ్లో వ్యతిరేక ఫలితాలు వస్తే… పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళన జగన్ లో నెలకొంది.ఈ క్రమంలో గ్రామ ప్రజలు అడగకుండానే ఈ రెండు పార్టీలు ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.

గ్రామం చుట్టూ ఉన్న ముళ్ల కంపలను తొలగిస్తున్నాయి.రజకులు అడగకున్నా… వారి ఇళ్ల వద్దకు ఇస్త్రీ పెట్టెలు వచ్చి వాలుతున్నాయి.

ఇక మట్టి కావాలంటే… ట్రాక్టర్ తో వెళితే సరి, అందులో మట్టి నింపేందుకు ఆ పార్టీలు ఏకంగా ఎక్స్ కవేటర్లను అక్కడ సిద్ధంగా ఉంచాయి.మరి ఉప ఎన్నికల్లో జగన్ సత్తా చాటి తన సొంతూళ్లో బలం నిలుపుకుంటారో?… చరిత్రను తిరగరాస్తూ వైఎస్ ఇలాకాలో టీడీపీ జెండా పాతుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube