YCP : వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల ..!!

ఏపీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ వైసీపీ ( YCP ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారం మరియు అభ్యర్థుల ఎంపిక వంటి విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

 Ycp : వైసీపీ తొమ్మిదో జాబితా విడ-TeluguStop.com

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నాయకులను నిత్యం ప్రజలలో ఉంచుతూ ఒకపక్క సర్వేలు చేయించుకుని వాటి ఫలితాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో సిట్టింగ్ అభ్యర్థులకు సంబంధించి వ్యతిరేకత ఉంటే పక్కన పెట్టేస్తున్నారు.

ఇప్పటికే 8 జాబితాలు విడుదల చేయడం జరిగింది.

తాజాగా నేడు 9వ జాబితా రిలీజ్ చేయడం జరిగింది.ఈ జాబితాలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇన్చార్జిలను ప్రకటించారు.నెల్లూరు పార్లమెంట్ ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )ఖరారు అయ్యారు.

కర్నూలు అసెంబ్లీ ఇన్చార్జిగా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్( Ex-IAS Imtiaz ), మంగళగిరి అసెంబ్లీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్యను( Lavanya ) .వైసీపీ అధిష్టానం ప్రకటించింది.ఇప్పటికే 8 జాబితాలను విడుదల చేసిన అధిష్టానం తాజాగా 9వ జాబితా రిలీజ్ చేయడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా…ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేయడం జరిగింది.

దీంతో మంగళగిరిలో నారా లోకేష్ పై వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పోటీ చెయ్యనున్నట్లు తెలుస్తోంది.ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో 175 కి 175 గెలిచేలా వైసీపీ అధినేత సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube