వైఎస్సార్ అమరుడైనా వారి పేరు మాత్రం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.దేశానికి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసినప్పుడే.
వైఎస్సార్ ఆత్మకు శాంతి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.వైఎస్సార్ 73వ జయంతి సందర్భంగా.
గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం.
పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో.
రేవంత్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజ్, కేవీపీ, పొన్నాల, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, కుసుమకుమార్ పాల్గొన్నారు.
గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ విశ్వాసపాత్రుడని రేవంత్‌రెడ్డి తెలిపారు.
రాహుల్‌ను ప్రధాని చేయటమే తన లక్ష్యమన్న వైఎస్సార్. చివరి కోరిక నెరవేరకుండానే దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైస్సార్ ఆలోచనలు కొనసాగించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వైఎస్సార్‌కు హైదరబాద్‌లో స్మృతివనం లేకపోవడం అవమానకరమన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైస్సార్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు.వైస్సార్ స్ఫూర్తితో పని చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దామని రేవంత్ సూచించారు.”సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని ఆరోజు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబెట్టిన నాయకుడు వైఎస్సార్.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడుగా ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు.
కాంగ్రెస్ పార్టీపై అటు మోదీ ఇటు కేసీఆర్ కుట్రలు తిప్పికొట్టడానికి వైస్సార్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంటు, ఫీజు రియంబర్స్మెంట్, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ మెట్రో రైలు, జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు.
ఇవన్ని వైఎస్సార్ ఇచ్చిన వరాలే.వైఎస్సార్ అమరుడైనా వారి పేరు మాత్రం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది.వైస్సార్ స్ఫూర్తితో పని చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దాం
.