పవన్ పై రూటు మార్చిన వైసిపి ?

పవన్( Pawan Kalyan ) ఒక మాటంటే తాము పది మాటలు అంటామన్నట్టుగా విరుచుకు పడిపోయే వైసిపి ఇప్పుడు పవన్ పె తన వైఖరి మార్చుకుందా అంటే అవుననే సమాధానం వస్తుంది.ముఖ్యంగా ఇటీవల పవన్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడం తో ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ పై దాడి చేయడం కంటే వేచి చూడడమే మంచిది అన్న నిర్ణయానికి వైసీపీ అధిష్టానం వచ్చినట్లుగా తెలుస్తుంది .

Ycp Changed Route On Pawan, Pawan Kalyan, Ycp, Ys Jagan , Ap Politics , Tdp, Ch

ముఖ్యంగా జనసేన( Janasena )లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు నిశితం గా పరిశీలిస్తున్న వైసిపి పవన్ తన మానాన తానని వదిలేస్తే తెలుగుదేశం జనసేన సీట్ల పంపకాలతో పవన్ మరింత బలహీన పడతారని, సొంత పార్టీ నేతల తో పాటు పవన్ సామాజిక వర్గం కూడా సీట్ల సర్దుబాటు తరవాత అసంతృప్తి తో రగిలిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్న వైసీపీ జరగబోతున్న పరిణామాల్లో జనసేన తనంతట తానే నష్టపోవడం ఖాయమని ఆలోచనలో ఉందట .

Ycp Changed Route On Pawan, Pawan Kalyan, Ycp, Ys Jagan , Ap Politics , Tdp, Ch

ముఖ్యంగా ఇటీవల సొంత పార్టీ శ్రేణులపై పవన్ చూపిస్తున్న ఆగ్రహం తీవ్రంగా చర్చనీయాంశంగా మారడంతో ఇప్పుడు పవన్ ని విమర్శిస్తే మళ్ళీ పవన్ కి మద్దతు పెరిగే అవకాశం ఉందని అలా కాకుండా సీట్ల సర్దుబాటు వరకు వేచి చూస్తే చాలామంది నేతలు పవను వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా వైసిపి అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది.దాంతో పవన్ పై విమర్శలు జోరుని కొంచెం తగ్గించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా వెళ్ళయట.ఏది ఏమైనా జనసేన సోషల్ మీడియా హడావిడి కూడా ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది.

ముఖ్యంగా తెలుగుదేశం అనుకూలంగా జనసేనాని తీసుకున్న నిర్ణయాలను సమర్థించడానికి జనసేన సోషల్ మీడియా కూడా కొంత వెనకడుగు వేస్తూ ఉండటం గమనార్హం.ఏది ఏమైనా సొంత పార్టీ శ్రేణులు అభిప్రాయాలకు భిన్నంగా తెలుగుదేశం పొత్తుపై దూకుడుగా ముందుకెళ్తున్న పవన్ అందుకు భారీ మూల్యం చెల్లిస్తారా లేక తగిన ప్రతిఫలం పొందుతారో మాత్రం ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నానే చెప్పాలి .

Advertisement
Ycp Changed Route On Pawan, Pawan Kalyan, Ycp, Ys Jagan , Ap Politics , Tdp, Ch
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

తాజా వార్తలు