తెలంగాణ (Telangana) లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాక ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ గా మారింది.ఇక ఎన్నికల తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కి అనుకూల ఫలితాలను ఇచ్చాయి.
ఇందులో ఒకటో రెండో సర్వేలు తప్ప మిగతావన్నీ కూడా కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అంటూ ఇలా ఎన్నో రకాల సర్వేలు చెప్పాయి.ఇక ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు పండగ చేసుకుంటున్న వేళ మరొక చిక్కు వచ్చి పడింది.
అదేంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఎందుకంటే సీఎం రేసులో రేవంత్ రెడ్డి తో పాటు బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy),జానారెడ్డి,పొన్నం ప్రభాకర్, సీతక్క వంటి వాళ్ళు ఉన్నారు.
అయితే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అయినప్పటికీ కర్ణాటక మాదిరిగా డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం అయ్యి సీనియర్ నేత సిద్ధరామయ్యకు సీఎం పీఠాన్ని ఇచ్చినట్టు తెలంగాణలో కూడా అదే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.అయితే తాజాగా వైయస్ఆర్టిపి పార్టీ అధినేత వైయస్ షర్మిల( YS Sharmila ) చేసిన కామెంట్లు ప్రస్తుతం కాంగ్రెస్లో కలకలం సృష్టించాయి.
వైఎస్ షర్మిల మాట్లాడుతూ.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అయ్యే అర్హత ఉత్తం కుమార్ రెడ్డి,( Uttham Kumar Reddy ) అలాగే భట్టి విక్రమార్కకి( Bhatti Vikramarka ) ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం బ్లాక్ మెయిలర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం అవ్వకూడదు అంటూ రేవంత్ రెడ్డి పై పరోక్ష కామెంట్లు చేసింది.ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ అవ్వడంతో వైయస్ షర్మిల (Y.S.Sharmila) రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఇలాంటి కామెంట్లు చేసిందని పలువురు భావిస్తున్నారు.ఎందుకంటే ఈమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తా అనుకున్న సమయంలో రేవంత్ రెడ్డి నేను పిసిసి చీఫ్ గా ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ కి చెందిన నేతలను ఎవరిని కాంగ్రెస్ లోకి రానివ్వను అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
అయితే షర్మిల కాంగ్రెస్ (Congress) లో తన పార్టీ ని విలీనం చేస్తా అని అన్నప్పుడు కాంగ్రెస్ లోని చాలామంది స్వాగతించినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యతిరేకించారట.ఈ కారణంతో రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఆమె పరోక్షంగా ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ సీఎం కాకూడదు అంటూ మాట్లాడినట్టు తెలుస్తోంది