వైయస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు.మాట మీద నిలబడటం అంటే ఏంటో కేసీఆర్ కు తెలియదని విమర్శించారు.
ఓట్లు కావాల్సినప్పుడు రావడం, మాయ మాటలు చెప్పడం, మళ్లీ ఫామ్ హౌజ్ కు వెళ్ళడం.ఎనిమిదేండ్లుగా ఇదే తీరుతో కేసీఆర్ పాలన నడుస్తున్నదని షర్మిల ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల తరఫున పోరాటం చేయడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని తనదైన శైలిలో షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రస్థాన యాత్ర పేరుతో షర్మిల చేపడుతున్న పాదయాత్ర 112 వ రోజుకు చేరుకుంది.యాత్రలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులపై తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ మరో పక్క సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతూ వైయస్ షర్మిల వార్తల్లో నిలుస్తున్నారు.







