ఎన్నికల ప్రచారానికి రెడీ అంటూ వైయస్ షర్మిల సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( AP Elections )లో మరో 40 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు.

 Ys Sharmila Sensational Post Saying She Is Ready For Election Campaign, Ap Elect-TeluguStop.com

దీంతో ఆయా పార్టీల అధినాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.వైసీపీ పార్టీ అధినేత జగన్ బస్సు యాత్ర చేస్తున్నారు.“ప్రజా గళం”( Prajagalam ) పేరిట చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.పవన్ కళ్యాణ్ “వారాహి విజయభేరి” అంటూ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( AP Congress Party Chief YS Sharmila ) కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావడం జరిగింది.ఈ సందర్భంగా తల్లి విజయమ్మ ఆశీర్వచనాలు తీసుకొని బయలుదేరింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.“దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను.మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను.న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను.

మీ వైయస్ షర్మిల రెడ్డి( YS Sharmila Reddy )” అంటూ పోస్ట్ పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత రెండుసార్వత్రిక ఎన్నికలలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు.

కానీ వైయస్ షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇటీవల అధికార పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.గతంతో పోలిస్తే ఏపీలో కాంగ్రెస్( Congress ) కాస్త మెరుగుపడిందని చెప్పవచ్చు.

ఈసారి ఎన్నికలలో వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube