YS Sharmila : తిరుపతి సభలో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( YS Sharmila )కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తుందని.

రాహుల్ గాంధీ( Rahul Gandhi ) తొలి సంతకం దీనిపైనే చేస్తారని షర్మిల ప్రకటించారు.తిరుపతి ఎస్వీ మైదానంలో జరిగిన ఈ సభలో ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల హక్కు అని అన్నారు.

రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో ప్రధాని మోదీ ఒకటైన నిలబెట్టుకున్నారా.? అని ప్రశ్నించారు.ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళు కావాలా.? తాకట్టు పెట్టే వాళ్ళు కావాలా.? ప్రజలే తేల్చుకోవాలి.

Ys Sharmila Sensational Comments In Tirupati Sabha

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఒకటే చిత్తశుద్ధితో ఉంది.అందుకే ఏపీలో ఆ పార్టీ కోమాలో ఉన్నా.ప్రత్యేక హోదా కోసం చేరా.అది రాష్ట్ర ప్రజల హక్కు.2014లో తిరుపతిలో ఇదే మైదానంలో మోడీ అనేక హామీలు ఇచ్చారు.రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని కడతామని అన్నారు.

Advertisement
Ys Sharmila Sensational Comments In Tirupati Sabha-YS Sharmila : తిరు�

రాష్ట్రాన్ని హార్డ్ వేర్ హబ్ చేస్తామన్నారు.ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం కట్టిస్తాం.

ఇచ్చిన హామీలలో ఒకటైన నిలబెట్టుకున్నారా.? కేంద్రం పదేళ్లుగా మన రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉంది.పక్కనున్న రాష్ట్రాల అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.

దక్షిణాది రాష్ట్రాలలో మెట్రో రైలు లేని రాష్ట్రం మనదే అంటూ వైఎస్ షర్మిల విచారం వ్యక్తం చేశారు.

మొటిమల తాలూకు మచ్చలు పోవడం లేదా? అయితే చియా సీడ్స్ తో ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు