YS Sharmila : హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వైయస్ షర్మిల..!!

ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల( YS Sharmila ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా జిల్లాల పర్యటనలు చేపట్టడం జరిగింది.

ఈ పర్యటనలలో అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మళ్లీ యాక్టివ్ చేశారు.2024 ఎన్నికలలో ప్రతి ఒక్కరు కష్టపడాలని రాహుల్ గాంధీని( Rahul Gandhi ) ప్రధానమంత్రిని చేయాలని వైఎస్ షర్మిల ( YS Sharmila )పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్పీచ్ లు ఇచ్చారు.

అంతేకాదు రాహుల్ గాంధీ ప్రధాని అయితే విభజన హామీలు నెరవేరుతాయి అని కూడా తెలియజేయడం జరిగింది.

ప్రస్తుతం "రాజన్న రచ్చబండ" అంటూ పర్యటనలు చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా తెలుగుదేశం పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలో సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న విమర్శలు రాజకీయంగా రసవత్తరంగా మారాయి.ఇదిలా ఉంటే సోమవారం హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ( CM Revanth Reddy )వైయస్ షర్మిల భేటీ అయ్యారు.

ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా రేవంత్ ను కలవడం జరిగింది.ఈ సందర్భంగా ఇరువురి మధ్య రెండు రాష్ట్రాల రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు షర్మిల వెల్లడించారు.

Advertisement
' హైడ్రా బాధితులకు బీఆర్ఎస్సే దిక్కు ! తెలంగాణ భవన్ కు వారంతా క్యూ 

తాజా వార్తలు