వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీకి పయనం కానున్నారు.దీనిలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆమె సమావేశం కానున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతిపై ఆధారాలతో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయనున్నారు.తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పాదయాత్రలో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే.
మరో వైపు షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి బిజెపి పై ఎటువంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం.ఈ క్రమంలోనే కెసిఆర్ పై ఫిర్యాదు చేసేందుకు షర్మిల ఢిల్లీ బాట పట్టడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.