లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్( AP Congress ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.ఏఐసీసీ కార్యాలయం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల,( PCC Chief YS Sharmila )
సీనియర్ నేత రఘువీరారెడ్డితో( Raghuveera Reddy ) పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.కాగా లోక్ సభ మరియు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీలో ప్రధానంగా చర్చించనున్నారు.తరువాత సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.