Mahesh Babu : ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు కామెంట్స్ వైరల్!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోలో వాళ్ల సినిమాలను ప్రమోట్ చేసుకోవడంతో పాటు ఒక హీరోల సినిమాలను ప్రమోట్ చేయడం వాళ్ళను ఎంకరేజ్ చేయడం అన్నది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది.అలా చాలామంది హీరోలు ఇతర హీరోల ప్రీ రిలీజ్ వేడుకలకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపి ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్న వారు చాలామంది ఉన్నారు.

 Superstar Mahesh Babu Review On Premalu Moviesuperstar Mahesh Babu Review On Pr-TeluguStop.com

అటువంటి వారిలో టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు( Hero Mahesh Babu ) కూడా ఒకరు.సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన సినిమాల గురించి కంటే కానీ కొన్నిసార్లు కొత్త లేదంటే చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు.

తనే స్వయంగా వెళ్లి, చూసి రివ్యూలు ఇస్తుంటాడు.గతంలో పలు తెలుగు చిత్రాల విషయంలో ఇలా చేశాడు.

ఇప్పుడు ఒక మలయాళ డబ్బింగ్ చిత్రానికి( malayalam Movie ) తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చేశాడు.

చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు మహేష్.హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన సినిమా ప్రేమలు( Premalu ). గత నెలలో మలయాళంలో రిలీజ్ కాగా శివరాత్రి( Shivaratri ) కానుకగా మార్చ 8న తెలుగు డబ్బింగ్ విడుదల చేశారు.దీన్ని స్టార్ డైరెక్టర్ కొడుకు కార్తికేయ తెలుగులోకి తీసుకొచ్చాడు.యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ చిత్రానికి మన ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్( Premalu Movie Successmeet ) కూడా పెట్టారు.ఇప్పుడు ఈ సినిమాని మహేశ్ బాబు చూశారు.

తనదైన స్టైల్లో ఎలా ఉందో చెప్పేశారు.ప్రేమలు మూవీని తెలుగులోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ కార్తికేయ( Karthikeya ).సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాము.గతంలో ఎప్పుడూ ఇంతలా నవ్వుకున్నానో గుర్తులేదు.

నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ ఈ మూవీ నచ్చింది.అందరూ టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు.

చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్ అని మహేశ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube