ఢిల్లీ: Apcc చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి.టీడీపీ, వైసీసీ పార్టీలు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నందుకు ఢిల్లీలో ఈ రోజు ధర్నా చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజేపీ పార్టీ ఏకీభవిచంచింది.కాంగ్రెస్ పార్టీ 5 ఏండ్లు ప్రత్యేక హోదా అంటే లేదు 10 ఏండ్లు ఇస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ తెలిపింది.
ఇవే కాకుండా వారు చెప్పిన అంశాలు పోలవరం, రాజధాని తదితర హామీలు ఇచ్చారు.మోడీ గారు తిరుపతిలో సభ పెట్టి ఏపీ ప్రజలకు 10ఏండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మాట ఇచ్చారు.ఇవన్నీ ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రశ్నిస్తున్నాం.
మీరంతట మీరే వచ్చి విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పారు.రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు.10 ఏండ్లు పూర్తయింది.
హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గడువు కూడా ముగిసింది.
కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ లో రైల్వే జోన్, దుగ్గిరాజ పట్టణానికి పోర్ట్, వైజాగ్ నుంచి చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ తెస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదు.ఇవేవీ నిలబెట్టుకోకపోగా విశాఖ స్ట్రీల్ ప్రాజెక్ట్ ను కూడా ప్రయివేటు పరం చేయాలని బీజేపీ చూస్తున్నారు.
ఏపీలో ఒక్క ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ బీజేపీ పార్టీకీ లేవు కానీ రాష్ట్రాన్ని ఏలుతోంది.వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిలుగా మారాయి.చంద్రబాబు గారు, జగన్ అన్న గారు ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల హామీల్లో చెప్పి మాట మరిచారు.మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టు కాదా.?
బీజేపీ పార్టీ ఏపీ ప్రజలను పురుగులుగా చూస్తోంది.ఆంధ్రప్రదేశ్ 25 మంది ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారారు.
పోలవరం, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎందుకు బానిసలు అయ్యారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి.?ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్ లో 2000 పరిశ్రమలు వచ్చాయి.హిమాచల్ ప్రదేశ్ లో 10వేల పరిశ్రమలు వచ్చాయి.ఇవేవీ లేకుండా బీజేపీకి ఎందుకు అమ్ముడుపోయారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి.?ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోకపోతే ఎప్పుడు తెచ్చుకుంటాం.? ఒక్క ఉద్యమమయినా ప్రత్యేకహోదా కోసం చేశారో చెప్పాలి.?46లక్షల కోట్ల బడ్జెట్ లో అమరావతి రైల్వే లైన్ కు 1000 రూపాయలు కేటాయించారు.
మనకు 25 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
మొత్తం 31 మంది ఎంపీలు కలిసి తలా 33 రూపాయలు తీసుకొచ్చారా.?ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉందా.? ఒక్క సారైనా కొట్లాడారా.? ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజల చేత కోటి సంతకాలు సేకరించి కాంగ్రెస్ పార్టీ ప్రధానికి ప్రతి ఏటా లేఖ ఇస్తూనే ఉంది.రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రధాని అయిన వెంటనే మొదటి సంతకం చేస్తామని చెప్పారు.ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో అడిగినా లెక్క చేయడం లేదు.
బీజేపీకి ఏపీపై చిత్తశుద్ధి లేదు.ప్రత్యేక హోదా అనే కాదు విభజన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది.