ఎపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జగన్కు సీపీఎమ్ మద్దతు ఇవ్వడం పెద్ద విశేషం కాదు.సీపీఎమ్ ఏపీ కార్యదర్శి మధు జగన్ దీక్షా శిబిరం దగ్గరకు వెళ్లి తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
సీపీఐ నాయకులే ఇంకా రాలేదని సమాచారం.సీపీఎమ్కు చంద్రబాబు అంటే అసలు పడదు.
బీజేపీతో దోస్తీ చేసే ఏ పార్టీనైనా సీపీఎమ్ దూరం పెడుతుంది.శత్రువు మాదిరిగా చూస్తుంది.
విధానాల పరంగా జగన్ అంటే సీపీఎమ్కు పడదు.జగన్ పార్టీ కూడా బూర్జువా పార్టీయే కాబట్టి సీపీఎమ్ దాన్ని దూరంగానే ఉంచుతుంది.
అయితే టీడీపీ మతతత్వ పార్టీ అయిన భాజపాకు మిత్ర పార్టీ కాబట్టి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.అందుకని జగన్కు మద్దతు ఇచ్చింది.
ఒకానొక కాలంలో టీడీపీ, సీపీఎమ్ దోస్తులుగా ఉండేవి.చాలా కాలం ఈ స్నేహం కొనసాగినా తరువాత రెండు పార్టీలు విడిపోయాయి.
బాబు ఒకప్పుడు భాజపాను చాలా ద్వేషించాడు.కాని రాజకీయ ప్రయోజనాలు ప్రధానం కాబట్టి మళ్ళీ దగ్గరయ్యాడు.







