డేంజర్ బెల్స్ మోగుతున్నాయ్ ! జగన్ జనాల్లోకి రావాల్సిందే 

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న జగన్ ఇప్పటి నుంచే అలర్ట్ గా ఉంటూ,  పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు.పదేపదే మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తూ,  గెలుపు ఎంత అవసరమో పదె పదే చెబుతున్నారు.

 Ys Jagan Should Solve Ap People Problems To Win Elections,jagan Tdp, Ysrcp, Mlc-TeluguStop.com

ఇక 2019 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోను వైసీపీ జెండా( YCP ) రెపరెపలాడుతూనే వచ్చింది.ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో వైసిపి విజయం సాధించినా,  ఆ రెండు స్థానాల్లో ఓటమి చెందడాన్ని వైసీపీ శ్రేణులు( YCP Leaders ) ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో వైసిపి ఓటమి చెంది, టిడిపి అభ్యర్థులు గెలుపొందడంతో టిడిపి మంచి జోష్ లో ఉంది.తాము రెండు స్థానాలు ఓటమి చెందినా, టిడిపి తమది విజయవన్నట్లుగా హడావుడి చేస్తుండడం , జనాల్లోకి వైసిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే సంకేతాలు పంపిస్తూ ఉండడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.

Telugu Ap Cm Jagan, Chandra Babu, Jagan, Mlc, Telugudesam, Ysrcp-Politics

మరోవైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు( Eelctions ) సమయం ఏడాది మాత్రమే ఉండడంతో, ఇప్పటి వరకు దిమాగానే ఉంటూ వచ్చిన జగన్ సైతం టెన్షన్ పడుతున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు.ఎన్నికలకు కొన్ని నెలలు ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు.తప్పకుండా అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుస్తారనే అతి ధిమా కారణంగానే ఈ రెండు స్థానాల్లో పరాభవం  చవి చూడాల్సి వచ్చింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap Cm Jagan, Chandra Babu, Jagan, Mlc, Telugudesam, Ysrcp-Politics

ఉత్తరాంధ్ర,  రాయలసీమలో తమ పార్టీకి ఎదురులేదనే అంచనా తోనే ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడంతో ఈ రకంగా ఫలితాలు వెలువడ్డాయనే చర్చ ఇప్పుడు పార్టీలో నడుస్తుంది.ఇక ఈ ఎన్నికలతోనైనా జగన్( YS Jagan ) మేల్కొని అతి ధీమాను విడిచిపెట్టి జనాల్లోకి వస్తేనే రాబోయే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వెలుపడతాయి.కేవలం సంక్షేమ పథకాలే తమను అధికారంలోకి తీసుకొస్తాయని అతి ధిమా ను విడిచిపెట్టి జగన్ సీరియస్ గా రాబోయే ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube