జ‌గ‌న్‌కు షాక్‌: వైసీపీలో బిగ్ వికెట్ డౌన్‌..!

ఏపీలోని కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా పాలిటిక్స్‌లో వంగ‌వీటి ఫ్యామిలీకి ఉన్న క్రేజే వేరు.

విజ‌య‌వాడ ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల నుంచి నేటి వ‌ర‌కు ఆ ఫ్యామిలీకి కృష్ణా జిల్లాతో పాటు తెలుగు పాలిటిక్స్‌లో ప్ర‌త్యేక‌త ఉంది.

దివంగ‌త వంగ‌వీటి మోహ‌న‌రంగా మ‌ర్డ‌ర్ నాడు 1989లో ఎన్టీఆర్ ప్ర‌భుత్వం ఓడిపోయేందుకు కూడా కార‌ణ‌మ‌న్న టాక్ ఉంది.రంగా త‌ర్వాత ఆయ‌న భార్య ర‌త్న‌కుమారి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ త‌ర‌పున రెండుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించింది.

ఇక దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండ‌దండ‌ల‌తో 25 ఏళ్ల‌కే ఎమ్మెల్యే అయ్యాడు రంగా త‌న‌యుడు వంగ‌వీటి రాధా.త‌క్కువ వ‌య‌స్సుకే ఎమ్మెల్యే అయిన రాధా ఆ త‌ర్వాత రాజ‌కీయంగా వేసిన రాంగ్‌స్టెప్పుల‌తో వెన‌క‌ప‌డిపోయాడు.2009లో ప్ర‌జారాజ్యంలోకి వెళ్లి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో వైసీపీలోకి మారి ఈ సారి విజ‌య‌వాడ తూర్పు నుంచి పోటీ చేసి మ‌రోసారి ఓడిపోయాడు.వంగ‌వీటి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా జ‌గ‌న్ రాధాను విజ‌య‌వాడ న‌గ‌ర వైసీపీ అధ్యక్షుడిగా నియ‌మించారు.

అయినా రాధా న‌గ‌రంలో పార్టీ ప‌టిష్ట‌త కోసం ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం లేదు.దీంతో జ‌గ‌న్ రాధాకు షాక్ ఇస్తూ ఇటీవ‌లే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు న‌గ‌ర వైసీపీ ప‌గ్గాలు అప్ప‌గించారు.

Advertisement

ఈ నిర్ణ‌యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా వెలంపల్లి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆయ‌న హాజ‌రు కాలేదు.వెలంపల్లికి బాధ్యతలు అప్పగించడం పట్ల రాధా విముఖంగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే వంగ‌వీటి ఏ క్ష‌ణంలో అయినా జ‌గ‌న్‌కు షాక్ ఇస్తార‌ని.ఆయ‌న వైసీపీకి గుడ్ బై చెప్పి జ‌న‌సేన‌లో చేర‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌వ‌న్‌కు రాధాకు స‌న్నిహిత సంబంధం ఉంది.ప‌వ‌న్ సైతం రాధాను పార్టీలో చేర్చుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

మ‌రి అదే జ‌రిగితే విజ‌య‌వాడ పాలిటిక్స్ మ‌రింత రంజుగా మార‌డం ఖాయం.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు