దగ్గరలో ఎన్నికల నగారా లేకపోయినా ఏపీ పాలిటిక్స్ పిచ్చ వేడిమీద ఉన్నయి.రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికరంగా ఉంటూ రోజుకి ఒక ట్విస్ట్ తో సాధారణ తెలుగు సినిమాకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటోంది.
కడప లో పర్యటిస్తున్న నారా లోకేష్ తన తెలుగు దేశం నాయకులతో కలిసి వైకాపా వారిని బుట్టలో వేసుకునే ప్రోగ్రాం పెట్టారు.కడప లాంటి వై ఎస్ జగన్ కి మంచి పట్టు ఉన్న చోట ఎమ్మెల్యే లని తమవైపు తీసుకుంటే తమకి మంచి పట్టు ఒస్తుంది అనేది నారా లోకేష్ లెక్క.
ఇది ఇప్పటి కోసం కాదు 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే లోకేష్ వేస్తున్న గేమ్ ప్లాన్.అందుకే మైండ్ గేమ్ తో జగన్ ని దారుణంగా ఇబ్బంది పెట్టాలి అని స్వయంగా కడపలో తిరుగుతున్నారు ఆయన.
కడప లో వైకాపా నేత మైసూరా ని లోకేష్ స్వయంగా ఒక హోటల్ లో కలవడం భారీ విశేషం.ఇది తెలుసుకున్న జగన్ హుటా హుటిన తన డిల్లీ టూర్ ని ముగించుకుని ఒచ్చి కడపలో తన క్యాడర్ ని అప్రమత్తం చేసారు అని తెలుస్తోంది.
దాంతో వరుసబెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి మేము టీడీపీలో చేరడం లేదంటూ చెబుతున్నారు.లోకేష్ ఇచ్చిన డీల్ కుదరలేదో… మరి జగన్ మంత్రాంగం ఫలించిందో తెలియదు కానీ… ఇప్పటికే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి – మరో మైనార్టీ ఎమ్మెల్యే తాము పార్టీ మారడం లేదని ప్రకటించారు.
తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం మొత్తం.కేవలం అధికార పార్టీ నేతల మైండ్ గేమ్ అంటున్నారు వీరు.జగన్ గనక రాకపోయి ఉంటే చాలా మంది ఎమ్మెల్యే లు జారిపోయేవారే.