విలువలకు విశ్వసనీయతకు తాను బ్రాండ్ అంబాసిడర్ ని అన్నట్టు నిత్యం చెప్పుకునే వైసీపీ అధ్యక్షుడు జగన్ వాస్తవంలో కూడా అలాగే ప్రవర్తిస్తూ .రాజకీయ విలువలకు కొత్త అర్ధం చెప్తున్నాడు.
ఏదైనా వివాదాస్పద అంశం పై రాజకీయ పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించడానికి వెనుకడుగు వేస్తుంటాయి.ఎందుకంటే దాని ప్రభావంతో తమ పార్టీకి పడే ఓట్లు ఎక్కడ చెల్లాచెదురు అవుతాయో అన్న భయం.ఇక కాపు రిజెర్వేషన్ అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఏ పార్టీ కూడా ఇమ్మని కానీ ఇవ్వద్దని కానీ తమ నిర్ణయాన్ని సూటిగా చెప్పలేకపోతున్నాయి.ఎందుకంటే ఇమ్మని డిమాండ్ చేస్తే బీసీ ఓట్లు గల్లంతు అవుతాయి.
వద్దు అంటే కాపుల ఓట్లు పోతాయి.ఈ డైలమాలో నే అన్ని పార్టీలు తికమక సమాధానాలతో ఈ రిజెర్వేషన్ అంశం పై నోరు మెదపడంలేదు.
ఒక్క వైసీపీ తప్ప.

తాజాగా… కాపు రిజర్వేషన్ల అంశం మీద జగన్ స్పందించిన తీరు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.కాపుల రిజర్వేషన్ అంశంలో తను మోసపూరిత మాటలు చెప్పలేను అని, ఆ అంశం గురించి తను ఎలాంటి హామీని ఇవ్వలేను అని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం గా నాంచివేత లేకుండా చెప్పాలనుకుంది చెప్పేసాడు.అయినా… కాపు రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం రిజర్వేషన్లు 50 శాతానికి చేరిపోయాయి.ఇంతకు మించి రిజర్వేషన్లను కల్పించడానికి రాజ్యాంగం కూడా ఒప్పుకోదు.ఒకవేళ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ కూడా అవసరం.అలాంటి ప్రయత్నం కేంద్ర కూడా చేసేలా లేదు.

కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తానని అంటూ తను అబద్ధం చెప్పలేను అని, చంద్రబాబు నాయుడులా మోసం చేయనని జగన్ స్పష్టం చేశాడు.సాధ్యం అయ్యే హామీలను మాత్రమే ఇస్తానని.వాటిని కచ్చితంగా అమలు చేస్తానని జగన్ స్పష్టం చేశాడు.ఈ ప్రకటనతో కాపులు తన విషయంలో అసహనానికి లోనయ్యే అవకాశం ఉందనేది జగన్ కు తెలిసిన విషయమే.
అయినప్పటికీ తను ఎవరినీ మోసం చేయలేనని అంటూ జగన్ సూటిగా చెప్పేశాడు.చంద్రబాబు నాయుడు మాత్రం అన్నీ తెలిసి కూడా గత ఎన్నికల ముందే కాపులకు రిజర్వేషన్ల హామీని ఇచ్చి మోసం చేశాడు.
ప్రస్తుతం కాపులు తాత్కాలికంగా జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినా జగన్ ప్రకటనలోని నిజాయితీని గుర్తించే అవకాశం అయితే లేకపోలేదు.