శ్రీరెడ్డి వ్యవహారంలో ప్రతి రోజు ఏదో ఒక డెవలప్‌మెంట్ ఉంటూనే ఉంది.ఆమెను ఎవరైనా విమర్శించడం లేదంటే, ఆమె ఎవరినైనా విమర్శించడం చాలా కామన్ అయ్యింది.
తెలుగు సినీ ప్రముఖుల గుండెల్లో గుబులు పుట్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు దక్కించుకుంది.ఇలాంటి శ్రీరెడ్డి తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీపై పడటం జరిగింది.
తమిళంకు చెందిన పలువురు సినీ ప్రముఖులను ఈమె టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు అక్కడ పెద్ద దుమారంను రేపుతున్నాయి.తెలుగులో శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరు ముందుకు రాలేదు, కాని తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా శ్రీరెడ్డిపై విమర్శలకు ముందుకు వస్తున్నారు.

తమిళ సినీ పరిశ్రమపై శ్రీరెడ్డి చేస్తున్న దాడిని తిప్పి కొట్టేందుకు దర్శక నిర్మాత అయిన వారాహి రంగంలోకి దిగాడు.ఈయన శ్రీరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అవకాశాల కోసం వారివద్ద వీరివద్ద పడుకున్నాను అంటూ చెబుతున్న శ్రీరెడ్డి ఒక వ్యభిచారి అంటూ ఆయన అన్నాడు.పోలీసులు వెంటనే శ్రీరెడ్డిని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయాలంటూ వారాహి డిమాండ్ చేశాడు.
ఈ సమయంలోనే శ్రీరెడ్డి కూడా వారాహిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడటం జరిగింది.
తానే డబ్బుల కోసం పడుకోలేదని, తనతో పడుకున్న వారు అంతా కూడా కనీసం తనకు భోజనం కూడా పెట్టించలేదు అంటూ వ్యాఖ్యలు చేసింది.
తాను అవకాశం కోసం అలా చేశాను తప్ప, తప్పుడు ఉద్దేశ్యం ఏమీ లేదని, కొందరు తనను బలవంతం కూడా చేశారు అంటూ చెప్పుకొచ్చింది.తనను వ్యభిచారి అంటూ అవమానించిన వారాహిపై తీవ్ర స్థాయిలో శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.
నీ అంతు చూస్తా, నీతో ఆట మొదలు పెట్టబోతున్నట్లుగా ఇటీవలే సోషల్ మీడియాలో ప్రకటించింది.

శ్రీరెడ్డి అన్నట్లుగానే వారాహిపై పోలీసు కేసు పెట్టింది.తనను వ్యభిచారి అంటూ అవమానించాడు అంటూ వారాహిపై శ్రీరెడ్డి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.శ్రీరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారాహి తనను లైంగికంగా కూడా వేదించాడని, ఫోన్‌లో బెదిరించేందుకు ప్రయత్నించాడని, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నాడు.
సినీ ఇండస్ట్రీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దనేది ఆయన ఉద్దేశ్యం, ఏదైనా మాట్లాడితే అంతు చూస్తాం అన్నట్లుగా ఆయన ఫోన్‌లో బెదిరించాడు అంటూ చెప్పుకొచ్చింది.ఈ కేసు వ్యవహారం ఎక్కడకు దారి తీస్తుందో అంటూ తమిళ సినీ వర్గాల వారు కాస్త టెన్షన్‌గా ఉన్నారు.







