ఏపీలో ఎన్నికల హడావిడి( AP Elections ) ఎనిమిది నెలల ముందే ప్రారంభం అయినట్లు కనిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్న వేళ ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
ఇటీవల టీడీపీ పార్టీని పలు స్కామ్ లు చుట్టుముట్టడంతో ఆ పార్టీని మరింత దెబ్బ తీసేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది.మరోవైపు టీడీపీతో పొత్తును కన్ఫమ్ చేసుకున్నా జనసేన.
ఫ్యూచర్ ప్లాన్స్ పై దృష్టి పెట్టింది.ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలకు చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు టీడీపీ అధినేతను జైలుపాలు చేసి ఆ పార్టీలోని ఆత్మస్థైర్యాన్ని గట్టిగా దెబ్బ తీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy).

ఇక ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ లను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు అడుగులు వేస్తున్నారు.చంద్రబాబు( Chandrababu Naidu ) హయంలో ఎన్నో స్కామ్ లు జరిగాయని ప్రజాధనాన్ని నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపిస్తున్నారు.ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్( Skill Development Scam ), ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూములు, నీరు చెట్టు.
ఇలా ప్రతిదాంట్లో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు.అవినీతి కుంభకోణాలతో దోషిగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు దత్త పుత్రుడు తొడయ్యడాని, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అన్నారు.

వచ్చే ఎన్నికలు అవినీతి పార్టీలకు, ప్రజపాలనకు మద్య జరగబోతున్నాయని చెబుతూ ప్రజల అండ, ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కూడా మనదే విషయం అంటూ జగన్ ధీమా వ్యక్తం చేశారు.కాగా ఇకపై ప్రచారంలో వేగం పెంచిన జగన్.ప్రధానంగా చంద్రబాబు స్కామ్ లనే ఎక్కువ ప్రస్తావించేలా సిద్దమైనట్లు తెలుస్తోంది.తాము అధికారంలో వచ్చిన మూడున్నర సంవత్సరాలలోనే అని పథకాలు అమలు చేశామని తమ పాలన మీకు మనస్ఫూర్తిగా నచ్చితే వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపించాలని జగన్ కోరుతున్నారు.
మొత్తానికి జగన్ విమర్శల ఘాటు పెంచుతూ పోలిటికల్ హీట్ ను మరింత రాజేస్తున్నారు.మరి ముందు రోజుల్లో కూడా టీడీపీ( TDP )ని ఎదుర్కోవడానికి విమర్శలే ప్రదాన అస్త్రాలుగా జగన్ సాగుతారా లేదా ఊహించని స్ట్రాటజీలతో అందరికీ షాక్ ఇస్తారా అనేది చూడాలి.







