YCP vs Janasena : కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ జగన్ ప్రభుత్వం

ఆంద్రప్రదేశ్ కు కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం( YCP YS Jagan Government ).కరోనా కు వ్యాక్షన్ మందు ఉంది.

కానీ జగన్ వైరస్ కు మందు ప్రజలే .అని జగన్ పై ధ్వజమెత్తారు జనసేనపార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు.ఈ రోజు ఉత్తరాంద్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా,పాయకరావుపేట మండలం,గుంటపల్లి గ్రామంలో జనసేనపార్టీ కార్యకర్తల సమావేశంలో నాగేంద్రబాబు, పంచకర్ల రమేష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) ఎంతో కష్టపడి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని,వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో మన పార్టీ గొంతు వినబడేలా మానందరం కష్టపడాలి అన్నారు.ఆంధ్రరాష్ట్ర ప్రజల కష్టాలు గమనించి పవన్ పార్టీ పెట్టారన్నారు.

జగన్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా చంద్రబాబు, పవన్ ల వ్యక్తిగత విషయాలు విమర్శించడం దౌర్భాగ్యం.ఎంత దాచుకోవాలి,ఎంత భూమి కబ్జా చేయాలని జగన్ ఆకాంక్ష.

Advertisement

పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ ఇచ్చిన అందరమూ కష్టపడి గెలిపించుకోవాలన్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు