ఆంధ్రప్రదేశ్ కి హోదా ఎవరైతే ఇస్తారో వారికే తాము మద్దతు ఇస్తామని వైఎస్సార్సీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మరో సారి స్పష్టం చేసారు.ఈ రోజు ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్ పలు ఆసక్తికర విషయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేసారు.
రాబోయే ఎన్నికలలో తాము ఎ పార్టీతో ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని పొత్తు పెట్టుకోవడం లేదని చెప్పిన జగన్, తాము ఒంటరిగానే బరిలో దిగుతామని తెలియజేసారు.అలాగే తన ద్రుష్టి మొత్తం ఏపీ అభివృద్ధి మీదనే వుందని కూడా జగన్ స్పష్టం చేసారు.
అలాగే తాను మేనిఫెస్టో లో పెట్టిన నవరత్నాలు వలన ఏపీలో అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందుతారని, ఇక వాటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి పంచాయితీలో ఓ సచివాలయం ఏర్పాటు చేస్తామని జగన్ స్పష్టం చేసారు.ఏపీకి ప్రత్యేక హోదాకి మించింది లేదని, దానిని ఎవరైతే ఇస్తారో వారికే ఎన్నికల తర్వాత తమ మద్దతు ఉంటుందని జగన్ తెలియజేసారు.
దీంతో మరో సారి వైఎస్ జగన్ తాను బీజేపీ పార్టనర్ అని తెలుగు దేశం అధినేత చంద్రబాబు చేసిన విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది అని చెప్పాలి.







