రాజమహేంద్రవరం వైసీపీలో కొద్ది రోజులుగా ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మధ్య ఆధిపత్య పోరు నెలకొన్న సంగతి తెలిసిందే.వీరిద్దరు రాజకీయ ఆధిపత్యం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేసుకుంటూ వెళుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్ ఛార్జ్ ల విషయంలో జగన్ జక్కంపూడికి ఝులక్ ఇచ్చారు.ఈ ఆధిపత్య పోరులో ఎంపీ భరత్ పై చేయి సాధించారు.
ఈ రెండు గ్రూప్‌ల వార్‌లో అధిష్టానం ఎంపీ భరత్ వైపే మొగ్గు చూపడం చర్చనీయం అయ్యింది.
తాజాగా రాజా వర్గానికి చెందిన సిటీ, రూరల్ కో ఆర్డినేటర్లను తప్పించి వారి స్థానంలో భరత్ వర్గానికి చెందిన వారికి పదవులు ఇచ్చారు.
గత ఎన్నికల్లో సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు.ఈ క్రమంలోనే సిటీలో శివరామ సుబ్రహ్మణ్యంను తప్పించి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు బాధ్యతలు ఇచ్చారు.
ఇక రూరల్లో ఆకుల వీర్రాజును తప్పించి ఆ ప్లేస్‌లో మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ కుమారుడు చందన నాగేశ్వర్‌ను ఇన్‌చార్జ్‌ను చేశారు.

ఏదేమైనా ఈ గ్రూప్ వార్‌లో రాజమహేంద్రవరం సిటీ, రూరల్లో జక్కంపూడికి పెద్ద షాకే తగిలింది. జక్కంపూడి రాజా వర్గానికి రాజమండ్రి అర్బన్, రూరల్ లో చెక్ పెట్టి రాజానగరానికే ఆయన్ను పరిమితం చేసినట్లు అయ్యింది.జక్కంపూడి వ్యూహాత్మకంగా తాను ప్రాధినిత్యం వహిస్తోన్న రాజానగరంతో పాటు సిటీ , రూరల్ నియోజకవర్గాల్లో పట్టు సాధించారు.
అయితే భరత్ వ్యూహాత్మకంగా అధిష్టానం దగ్గర చక్రం తిప్పి రాజా కు రైట్ లెఫ్ట్ గా ఉన్న రెండు నియోజకవర్గాల కో ఆర్డినేటర్ లను కట్ చేసేశారు.దీంతో జక్కంపూడి వర్గం పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లిపోయింది.
అయితే అదే క్రమంలో అధికార పార్టీలో ఉన్న సవాళ్లను ఎదుర్కొంటూ రాజమహేంద్రవరం మేయర్ పీఠంపై వైసీసీ జెండా ఎగరవేసేలా చేయడం ఎంపీ భరత్‌కు పెద్ద సవాలే అని చెప్పాలి.మరి దీనిని భరత్ ఎలా ఎదుర్కొంటారో ? చూడాలి.