ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.ఆ మలుపులను సులువుగా మలచుకుని ముందుకు వెళ్తున్నా వైసీపీ అధినేత జగన్.
దాదాపుగా రెండువందల రోజులుగా పాదయాత్ర చేపడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు.అధికార టీడీపీ సృష్టిస్తున్న అనేక అడ్డంకుల్ని దాటుకుని దూసుకెళ్తున్నారు.
జనసేన, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, లోక్‌సత్తాలతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక`ష్ణ ప్రకటించడం.ముందస్తు ఎన్నిలకంటూ బాబుగారు సెలవివ్వగా.
లేదులేదు.ముందస్తుకు వెళ్లబోమనీ, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలంటూ చినబాబుగారు ప్రకటించడంలో ఆంతర్యమేమిటన్నదే ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిగ్‌గా మారింది.
నిజానికి 200రోజులుగా ప్రజాసంకల్పయాత్రతో వైసీపీ అధినేత జగన్ జనం మధ్యలో ఉంటున్నారు.అప్పటికీ ఇంకా ఎన్డీయేలో చంద్రబాబు కొనసాగుతున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ను పక్కన పడేసి, ప్యాకేజీ అంటూ మోడీతో నాలుగేళ్లపాటు అంటకాగారు.ఈ సమయంలోనూ బాబుగారి తీరును జగన్ ఎండగట్టారు.ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివ`ద్ధి చెందుతుందనీ పదేపదే మొత్తుకున్నా పట్టించుకోకుండా.ప్యాకేజీ చాలంటూ బాబుగారు చప్పట్లు కొట్టడం ఆంధ్రులు కళ్లారా చూశారు.
తీరా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం చెప్పడంతో ఇప్పుడు కేకలు వేస్తున్న చంద్రబాబు తీరుపై ఆంధ్రుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలోనూ చంద్రబాబు మొదట వైసీపీకి మద్దతు ఇస్తానని ప్రకటించి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఎక్కడ వైసీపీకి క్రెడిట్ దక్కుతుందోనన్న ఆందోళనతోనే రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పడేసి.రాజకీయ ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నారు.మోడీపై యుద్ధం అంటూ పైకి చెబుతూనే.నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా మోడీకి చంద్రబాబు వంగి వంగి భక్తిభావం చాటడం కూడా ప్రజల కళ్లెదుట కదలాడుతూనే ఉంది.
తాజాగా.ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు సందడి షురూ చేయగా.
ఆయన తనయుడు, మంత్రి మాత్రం ముందస్తు లేదంటూ అనడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
బాబుగారి యూటర్న్ వెనక బలమైన కారణమే ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయంటూ అంతర్గత సర్వేలు తేల్చడంతో ముందస్తులో వెనకడగు వేశారనే వాదన ఇప్పుడు ఏపీలో బలంగా ఉంది.నాలుగేళ్లపాటు మోడీతో ఆడిపాడి ఇప్పుడు కేకలు వేస్తే ప్రజలెవరూ నమ్మేస్థితిలో లేరని, అంతేగాకుండా.
ఇటీవల ఓ అనుకూల పత్రిక నిర్వహించిన సర్వేలోనూ టీడీపీకి కేవలం వంద సీట్లు వస్తాయని తేలడంతో బాబుగారికి ఒకింత ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో వైసీపీని దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం చెందాయని కూడా ఆ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.