సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తుండడం…ఈ మేరకు ఎన్నికల సంఘం దానిపై తీవ్ర కసరత్తు చేస్తుండడంతో….ఏపీలో అన్ని పార్టీలు ఇక వేడి పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి.
అధికార పార్టీ టీడీపీ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి… పథకాలు… ఇవాన్నీ తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ భావిస్తోంది.ఇక జనసేన విషయానికి వస్తే…సభలు.సమావేశాలతో….పవన్ హోరెత్తిస్తున్నారు.
కాకపోతే ఆయన ఏపీ అంతా ఫోకస్ చేయకుండా….కేవలం కొన్ని కొన్ని ఎంపిక చేసుకున్న జిల్లాల్లో ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నాడు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే పాదయాత్ర పేరుతో….ఏపీ అంతా దాదాపు చుట్టేశాడు.
పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలను కూడా పరిష్కరించే దిశగా ఇప్పటికే అనేక సంస్కరణలు కూడా మొదలుపెట్టాడు.అంతే కాకుండా ….
ఏపీకి ప్రత్యేక హోదా నినాదాన్ని మళ్ళీ ఎత్తుకుని అదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లేందుకు జగన్ సిద్ధం అవుతున్నాడు.

ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే విషయంలో టీడీపీ ఘోరంగా విఫలం అయ్యిందని… ముందుగా ప్రత్యేక హోదా తీసుకువస్తామని ప్రకటించి… ఆ తరువాత బీజేపీతో లాలూచి పడి ప్రత్యేక హోదా అవసరం లేదు … ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుంది అంటూ… ప్రకటించడం… ఇలా అన్నిరకాలుగా టీడీపీ మోసం చేసింది అని… కానీ….ముందు నుంచి… ప్రత్యేక హోదా ఉద్యమం కోసం వైసీపీ పోరాడుతూనే ఉందని జగన్ మరోసారి ప్రజలకు చెప్పేందుకు జగన్ సిద్ధం అవుతున్నాడు.ఇప్పటికే….వివిధ ప్రాంతాల్లో ధర్నాలు,జగన్ ఆమరణదీక్షలు, యువభేరిలు వంటి ఈ ప్రత్యేక హోదా కోసమే చేశారు.అయితే ఆ తర్వాత జగన్ పాదయాత్ర చేయడం ప్రారంభించడంతో దాదాపు ఏడాదికిపైగా హోదాపై ఉద్యమాన్ని వైసీపీ పక్కనపెట్టాల్సి వచ్చింది.

ఏపీ ప్రజలకు టీడీపీ – బీజేపీ చేసిన మోసాన్ని బయటపెట్టి ప్రజల్లో సానుభూతి సంపాదించుకునేందుకు ….ప్రత్యేక హోదా విషయం .విభజనచట్టంలో ఉన్న హామీలన్నింటినీ అమలుపర్చాలని ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేయాలని జగన్ పార్టీ శ్రేణులను ఆదేశించారు.ఇప్పటికే ప్రత్యేక హోదాకోసం ఆపార్టీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.
దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని జగన్ భావిస్తున్నారు.ప్రస్తుతం పార్లమెంటుశీతాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ వేదికగా మహాధర్నాకు ప్లాన్ చేయాలని జగన్ పార్టీ శ్రేణులను ఆదేశించారు.
ఈ నెల 28వ తేదీ ఈ ధర్నా ఢిల్లీలో చేపట్టే ఆలోచనలో జగన్ ఉన్నాడు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజల్లో స్పెషల్ స్టేటస్ మీద వేడి రగిల్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నాడు.
ప్రత్యేక హోదా విషయంతో పాటు….టీడీపీ ప్రభుత్వ అవినీతి … అక్రమాల మీద కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి వైసీపీ మైలేజ్ పెంచాలని జగన్ ప్రణాళికలు వేస్తున్నాడు.